KL Rahul Trolled by Ahan Shetty: గాయంతో జట్టు నుంచి దూరమైన స్టార్ బ్యాటర్   కేఎల్ రాహుల్ ఖాళీ సమయాన్ని  క్రియేటివిటీ కోసం వాడుతున్నాడు. తనలోని ఫోటోషాప్ కలను ప్రపంచానికి పరిచయం  చేస్తూ...

టీమిండియా బ్యాటర్, భావి భారత సారథిగా భావిస్తున్న కేఎల్ రాహుల్ గాయంతో కొద్దిరోజులుగా క్రికెట్ కు దూరమయ్యాడు. గత నెలలో వెస్టిండీస్ తో వన్డే సిరీస్ సందర్భంగా గాయపడ్డ అతడు.. ప్రస్తుతం బెంగళూరులోని రీహాబిటేషన్ సెంటర్ లో గడుపుతున్నాడు. అయితే క్రికెట్ నుంచి కాస్త టైం దొరకడంతో రాహుల్.. తన క్రియేటివిటీని చూపెడుతున్నాడు. తాజాగా అతడు ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసిన ఓ పోస్టుపై అతడి గర్ల్ ఫ్రెండ్ (?) అతియా శెట్టి సోదరుడు అహన్ శెట్టి ఫన్నీ కామెంట్ పెట్టాడు. 

ఇన్స్టా వేదికగా ఫోటో షాప్ లో ఎడిట్ చేసిన రెండు ఫోటోలను పోస్టు చేశాడు రాహుల్.. రెండు బండ రాళ్లపై రాహుల్ కూర్చుని ఉండగా.. వెనకాల చందమామ ఉండే విధంగా ఫోటోను ఎడిట్ చేశాడు రాహుల్. దీనికి హిందీలో వచ్చిన వెబ్ సిరీస్ సాక్ర్డ్ గేమ్స్-2లోని పాపులర్ డైలాగ్ ‘చంద్రుడిపై ఉన్నా’ (చాంద్ పే హై అపన్) ను క్యాప్షన్ గా పెట్టాడు. 

రాహుల్ పెట్టిన ఈ ఫన్నీ పోస్టు కొద్దిసేపట్లోనే వైరల్ గా మారింది. రాహుల్ ను టీజ్ చేస్తూ కామెంట్స్ పెట్టారు. రాహుల్ ఫ్రెండ్, టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ స్పందిస్తూ.. ‘బాబీ నువ్వేమైనా యాపిల్ మ్యాప్స్ వాడుతున్నావా..?’ అని కామెంట్ చేశాడు.

View post on Instagram

ఇక బాలీవుడ్ యాంగ్రీ యంగ్ మెన్ సునీల్ శెట్టి కుమారుడు అహన్ శెట్టి స్పందిస్తూ.. ‘బహుశా ఇది మార్స్ గ్రహం అనుకుంటా.. ’ అని కామెంట్ చేశాడు. ఇదిలాఉండగా అహన్ శెట్టి కామెంట్ కు అనూహ్యంగా లైకులు పెరగడం విశేషం. పలువురు ఆకతాయి నెటిజన్లు.. ‘బావతో పరాచికాలొద్దు.. మాట్లాడుకుందాం..’ అంటూ ఆటపట్టించారు. ఆ పోస్టును.. అహన్ శెట్టి కామెంట్స్ ను మీరు చూసేయండి మరి.. 

Scroll to load tweet…

ఇక ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న కెఎల్ రాహుల్.. ఆ సన్నాహాల్లో ఉన్నాడు. గాయంతో టీమిండియా కు దూరమైన సమయాన్ని తన ఐపీఎల్ జట్టు కోసం వినియోగిస్తున్నాడు. రాబోయే ఐపీఎల్ లో అనుసరించాల్సిన వ్యూహాలు, జట్టు కూర్పు, ఇతరత్రా అంశాలను కోచ్ లు, ఇతర సహాయక సిబ్బందితో చర్చిస్తున్నాడు. మరి ఎన్నో ఆశలతో ఐపీఎల్ లో అడుగిడి.. వేలం ప్రక్రియలో భారీగా వెచ్చింది లక్నో ఫ్రాంచైజీని దక్కించుకున్న ఆర్పీఎస్జీ అధినేత సంజీవ్ గొయెంకా నమ్మకాన్ని రాహుల్ నిలబెడతాడా..? లేక పంజాబ్ కింగ్స్ కు మాదిరిగానే వైఫల్యాల బాట పట్టిస్తాడా..? అనేది మరో నెలరోజుల్లో తేలిపోతుంది.