ఆ దూకుడుకు నేను పెద్ద ఫ్యాన్‌ని .. కోహ్లీపై అభిమానం చాటుకున్న నిఖిల్ చౌదరి
ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో తుఫాను సృష్టిస్తోన్న బౌలింగ్ ఆల్‌రౌండర్ నిఖిల్ చౌదరి .. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. తాను కోహ్లీకి వీరాభిమానినని, గడిచిన పదేళ్లుగా ఆయనను అనుసరిస్తున్నానని చెప్పాడు.
ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో తుఫాను సృష్టిస్తోన్న బౌలింగ్ ఆల్‌రౌండర్ నిఖిల్ చౌదరి .. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. తాను కోహ్లీకి వీరాభిమానినని, గడిచిన పదేళ్లుగా ఆయనను అనుసరిస్తున్నానని చెప్పాడు. ఉన్ముక్త్ చంద్ తర్వాత బీబీఎల్‌లో ఆడిన భారత సంతతికి చెందిన రెండవ క్రికెటర్ నిఖిల్ . కోహ్లీ దూకుడుకు తాను పెద్ద అభిమానినని నిఖిల్ మ్యాచ్ అనంతరం ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
ఢిల్లీలో జన్మించిన నిఖిల్ .. హోబర్డ్ హరికేన్స్ తరపున బీబీఎల్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆస్ట్రేలియాలో స్థిరపడాలని భావిస్తున్నానని, ఏడాది కాంట్రాక్ట్‌ను మించి బీబీఎల్‌లో బలమైన కెరీర్‌ను నిర్మించాలని భావిస్తున్నట్లు నిఖిల్ తెలిపాడు. ఇవాళ్టీ మ్యాచ్‌లో భాగంగా మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌తో హోబర్డ్ హరికేన్స్ తలపడింది. బిగ్‌బాష్ లీగ్‌లో ప్రూవ్ ఫినిషర్‌గా ఎదగాలని భావిస్తున్న నిఖిల్.. తన హరికేన్స్ సహచరుడు , ముంబై ఇండియన్స్ ఆటగాడు టిమ్ డేవిడ్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని చెప్పాడు.
తాను రెండు నెలలుగా టీమ్ డేవిడ్‌తో మాట్లాడుతున్నానని.. ఒప్పందంపై సంతకం చేసినప్పుడు ఆయన నాకు నేరుగా సందేశం పంపాడని నిఖిల్ గుర్తుచేసుకున్నాడు. ఆయన ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ ఫినిషర్, హిట్టర్లలో ఒకడని పేర్కొన్నాడు. అతను గత రెండేళ్లుగా ముంబై ఇండియన్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడని తెలిపాడు.