Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో టీ20 మ్యాచ్.. మరి హైదరాబాద్ కు మొండిచేయి

భవిష్యత్ ప్రణాళికలో భాగంగా ఈ ఏడాది నవంబర్ నుంచి 2022 జూన్ మధ్యలో సొంత గడ్డపై భారత్ 14 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేలు కలిపి మొత్తం 21 మ్యాచ్ లు ఆడనుంది. కానీ అందులో ఒక్క మ్యాచ్ కూ హైదరాబాద్ వేదిక కాదు.

Hyderabad Dropped From the List of Venues For International Match season 2021-22
Author
Hyderabad, First Published Sep 21, 2021, 7:51 AM IST

క్రికెట్ పండగ మళ్లీ మొదలైంది. ఆగిపోయిందనుకున్న ఐపీఎల్ మళ్లీ షురూ అయిన సంగతి తెలిసిందే. కాగా..  త్వరలోనే టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ జరగనుంది. అయితే.. ఈ టీ20 (T20) మ్యాచ్ మన దేశంలోనూ జరిగే అవకాశం ఉంది. వచ్చే ఎనిమిది నెలల్లో స్వదేశంలో టీమ్ ఇండియా ఆడే అంతర్జాతీయ సిరీస్ లకు సోమవారం బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది.

అందులో భాగంగా ఓ టీ20 మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని విశాఖపట్నం దక్కించుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న వెస్టిండీస్ తో రెండో టీ20 విశాఖలో జరుగుతుంది. హైదరాబాద్ కు మాత్రం నిరాశే మిగిలింది. ఉప్పల్ స్టేడియానికి మరోసారి మొండి చెయ్యే ఎదురైంది. భవిష్యత్ ప్రణాళికలో భాగంగా ఈ ఏడాది నవంబర్ నుంచి 2022 జూన్ మధ్యలో సొంత గడ్డపై భారత్ 14 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేలు కలిపి మొత్తం 21 మ్యాచ్ లు ఆడనుంది. కానీ అందులో ఒక్క మ్యాచ్ కూ హైదరాబాద్ వేదిక కాదు.

అందుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం లోని అంతర్గత కుమ్ములాటలే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రెండు వర్గాలుగా చీలిపోయిన హెచ్సీఏ పాలకవర్గం విభేదాలతో ఇప్పటికే హైదరాబాద్ అబాసుపాలైంది. ఈ ఏడాది ఐపీఎల్ 14వ సీజన్ మ్యాచ్ ల వేదికల్లోనూ హైదరాబాద్ కు చోటు దక్కలేదు.

ఇక ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్ ల విషయంలోనూ నిరాశ తప్పలేదు. మ్యాచ్ ల నిర్వహణలో ఎంతో చరిత్ర ఉన్న హైదరాబాద్ కు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రావడం అభిమానులకు రుచించడం లేదు. ఇక టెస్టులకు కాన్పూర్, ముంబయి, బెంగళూరు, మొహాలీ పరిమిత ఓవర్ల మ్యాచ్ లకు జైపూర్, రాంచి, లఖ్ నవూ, విశాఖ, కోల్ కతా, అహ్మదాబాద్, కటక్, త్రివేండ్రం, చెన్నై, రాజ్ కోట్, ఢిల్లీ అతిథ్య మివ్వనున్నాయి. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో పొట్టి ఫర్మాట్ పైనే బీసీసీఐ ఎక్కువగా దృష్టి పెట్టింది.

టీమిండియా షెడ్యూల్...

న్యూజిలాండ్ తో మూడు టీ20లు( నవంబర్ 17, 19, 21 తేదీల్లో), రెండు టెస్టులు( నవంబర్ 25-29, డిసెంబర్ 3-7) వెస్టిండీస్ తో  మూడు వన్డేలు( ఫిబ్రవరి 6,9,12), మూడు టీ20లు( ఫిబ్రవరి 15,18,21) శ్రీలంకతో రెండు టెస్టులు( ఫిబ్రవరి 25, మార్చి 1, మార్చి5-9), మూడు టీ20లు( మార్చి 13, 15,18) దక్షిణాఫ్రికాతో ఐదు టీ20లు(జూన్ 9,12,14,17,19)

Follow Us:
Download App:
  • android
  • ios