12,50,307... వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023...
ఫైనల్ మ్యాచ్‌ని స్టేడియంలో వీక్షించిన 92,453 మంది... గత వరల్డ్ కప్‌తో పోలిస్తే రెట్టింపు పెరిగిన స్టేడియంలోకి వచ్చిన ఫ్యాన్స్ సంఖ్య..
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి భారత జట్టు వేదిక ఇచ్చింది. ఇండియా ఆడిన మ్యాచ్‌లకు జనాలు ఎగబడి రాక, పాకిస్తాన్, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఆడిన మ్యాచులకు కూడా ప్రేక్షకులు వేల సంఖ్యలో హాజరయ్యారు..
2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి 10 లక్షల 16 వేల మంది ప్రేక్షకులు హాజరుకాగా, ఈసారి ఆ సంఖ్య భారీగా పెరిగింది. అధికారిక లెక్కల ప్రకారం అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకూ జరిగిన ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ మ్యాచులను స్టేడియంలో చూసిన ప్రేక్షకుల సంఖ్య 12 లక్షల 50 వేల 307. ఫైనల్ మ్యాచ్‌ని 92,453 మంది వీక్షించారు..
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం పూర్తి కెపాసిటీ 1 లక్షా 30 వేలకు పైనే. ఫైనల్ టికెట్లు కూడా పూర్తిగా అమ్ముడుపోయాయి. అయితే చాలామంది ఫైనల్ మ్యాచ్ టికెట్లను బ్లాక్‌లో విక్రయించాలని ప్రయత్నించడంతో స్టేడియానికి రావాల్సినంత మంది రాలేదు. దానికి తోడు ఆట ప్రారంభమైన కొద్ది సేపటకే భారత జట్టుపై ఆస్ట్రేలియా ఆధిపత్యం ప్రదర్శించింది..
దీంతో టీమిండియా ఓటమి ఖాయమని ఫిక్స్ అయిన చాలామంది, స్టేడియానికి రావడానికి ఆసక్తి చూపించలేదు. ఈ కారణంగా మెల్‌బోర్న్‌లో జరిగిన 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్, అత్యధిక మంది వీక్షించిన క్రికెట్ మ్యాచ్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌ని 93,013 మంది వీక్షించారు..