Asianet News TeluguAsianet News Telugu

ఆస్కార్‌ను మించి ఆఫ్ఘ‌నిస్తాన్ మ్యాచ్ లో హైడ్రామా.. వీడియో

AFG vs BAN: టీ20 ప్రపంచ కప్ 2024లో బంగ్లాదేశ్ ను చిత్తుచేసి ఆఫ్ఘనిస్తాన్  సరికొత్త చరిత్ర సృష్టిస్తూ మొదటి సారి సెమీ ఫైనల్ కు చేరుకుంది. సెమీ-ఫైనల్ పోరు కోసం ఇరు జ‌ట్ల మ‌ధ్య గట్టి పోటీ కనిపించింది. అయితే, మ్యాచ్ మధ్యలో ఆఫ్ఘన్ కోచ్ సూచనలతో ఆ జట్టు బౌలర్ గుల్బాదిన్ నైబ్ చేసిన డ్రామా ఆస్కార్ ఫెర్ఫామెన్స్ కు తక్కువేమీ కాదు.. ! 
 

High drama in AFG vs BAN match beyond Oscar performance..  Jonathan Trott - Gulbadin Naib Video Viral RMA
Author
First Published Jun 25, 2024, 12:24 PM IST

AFG vs BAN T20 World Cup 2024 : సెమీ-ఫైనల్ బెర్తు కోసం సూప‌ర్-8లో ఆఫ్ఘనిస్తాన్-బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ చివ‌రి వ‌ర‌కు తీవ్ర ఉత్కంఠ‌ను రేపింది. ఇరు జ‌ట్ల మ‌ధ్య‌ గెలుపు కోసం గట్టి పోటీ కనిపించింది. చివ‌ర‌కు అద్భుత‌మైన టైమింగ్ తో వికెట్లు ప‌డ‌గొట్టి ఆఫ్ఘ‌నిస్తాన్ సూప‌ర్ విక్ట‌రీని అందుకుంది. థ్రిల్లింగ్ గెలుపుతో టీ20 ప్ర‌పంచ క‌ప్ లో తొలిసారి సెమీ ఫైన‌ల్ కు చేరుకుని చ‌రిత్ర సృష్టించింది. తొలుత బ్యాటింగ్  చేసిన ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 115 ప‌రుగులు చేసింది. ల‌క్ష్య ఛేద‌న‌లో బంగ్లాదేశ్ వ‌ర్షం అంత‌రాయం కార‌ణంగా మ్యాచ్ ను 19 ఓవ‌ర్ల‌కు గానూ 114 ప‌రుగుల టార్గెట్ ను నిర్ణ‌యించాడు. 17.5 ఓవ‌ర్ల‌లో 105 ప‌రుగుల‌కు ఆలౌట్ కావ‌డంతో 8 ప‌రుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓడిపోయింది.

ఈ మ్యాచ్ ఆరంభం నుంచి అనేక మ‌లుపులు, నాట‌కాలు క‌నిపించాయి. ప‌లుమార్లు వ‌ర్షం మ్యాచ్ ను అడ్డుకుంది. చిరు జల్లుల ప‌డుతున్న స‌మ‌యంలోనూ మ్యాచ్ సాగింది. బ్యాటింగ్ స‌మ‌యంలో ప్లేయ‌ర్లు ప‌రుగుల కోసం ఒకే ఎండ్ వైపు ప‌రుగెత్తిన వింత దృశ్యాలు కూడా క‌నిపించాయి. మొత్తంగా ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు అఫ్గానిస్థాన్‌ ఎంతకైనా తెగించేలా కనిపించింది. ఉత్కంఠభరితమైన పోరులో కోచ్ సూచనల మేరకు ఆఫ్ఘనిస్థాన్ ఫాస్ట్ బౌలర్ గుల్బాదిన్ నైబ్ చేసి ప‌నిని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. మ్యాచ్ మధ్యలో ఆ జట్టు బౌలర్ గుల్బాదిన్ చేసిన డ్రామా ఆస్కార్ ఫెర్ఫామెన్స్ కు తక్కువేమీ కాదు.. ! అత‌ను అలా చేయ‌డం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఒకే దెబ్బ‌కు రెండు జ‌ట్లు ఔట్.. టీ20 ప్రపంచ కప్ 2024లో ఇదే గొప్ప థ్రిల్లింగ్ మ్యాచ్..

మ్యాచ్ మధ్యలో వికెట్ కీప‌ర్ ప‌క్క‌గా ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో గుల్బాదిన్ అకస్మాత్తుగా కిందపడి పోయాడు. త‌న స్నాయువుకు గాయమైన‌ట్టుగా డ్రామా చేశాడు. అయితే, కొంత సమయం తర్వాత అతను గ్రౌండ్ లో వేగంగా బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఫాస్ట్ బౌలర్ చేసిన‌ ఈ డ్రామా ఆఫ్ఘనిస్తాన్‌ను మొదటిసారి సెమీ-ఫైనల్‌కు తీసుకెళ్లడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించిందని చెప్పాలి. ఎందుకంటే, తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ జట్టు బంగ్లాదేశ్ ముందు 116 పరుగుల టార్గెట్ ఉంచింది. వ‌ర్షం అడ్డుప‌డుతున్నప్ప‌టికీ బంగ్లా మంచి శుభారంభం చేసింది.

ఈ స‌మ‌యంలో రషీద్ ఖాన్ తన స్పిన్ మాయాజాలంతో మ్యాచ్ ను ఆఫ్ఘ‌న్ వైపు తిప్పాడు. కానీ లిటన్ దాస్ అద్భుత‌మైన బ్యాటింత్ తో ఆఫ్ఘనిస్తాన్ కు టెన్ష‌న్ పెట్టాడు. దీంతో వర్షం ఆశ మాత్రమే ఆఫ్ఘనిస్తాన్‌ను తిరిగి మ్యాచ్ విన్నింగ్ ట్రాక్ లోకి తీసుకురాగలదని గ్ర‌హించిన ఆ జ‌ట్టు కోచ్ జోనాథన్ ట్రాట్ మ్యాచ్ నెమ్మదించాలని ఆటగాళ్లకు సంకేతాలు ఇచ్చాడు. ఇది చూసిన గుల్బాదిన్ నైబ్ స్లిప్ వద్ద నిలబడి వెంట‌నే గాయపడినట్లు నటించడం ప్రారంభించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. 

యువరాజ్ సింగ్ చేయలేదని హార్దిక్ పాండ్యా సాధించాడు..

 

 

 

 

టీ20 నెంబర్.1 ప్లేయర్ గా రోహిత్ శర్మ.. కోహ్లీని అధిగమిస్తూ రికార్డులు బద్దలు కొట్టాడు 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios