వెల్లింగ్టన్: ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడం తప్ప తనకు మరో చాయిస్ లేదని టీమిండియా బ్యాట్స్ మన్ మనీష్ పాండే అన్నాడు. న్యూజిలాండ్ పై జరిగిన నాలుగో టీ20లో శార్దూల్ ఠాకూర్ వేసిన చివరి ఓవరుతో పాటు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీల సూపర్ ఓవర్ ప్రదర్శన హైలెట్ అయింది. 

విజయానికి చివరి ఓవరులో 7 పరుగులు కావాల్సిన స్థితిలో శార్దూల్ ఠాగూర్ 6 పరుగులు మాత్రమే సమర్పించుకున్నాడు. దాంతో పాటు రెండు వికెట్లను కూడా తీసుకున్నాడు. దీంతో మ్యాచ్ టై అియంది. అయితే, పోరాటం చేయడానికి తగిన స్కోరును న్యూజిలాండ్ ముందు ఉంచడంలో మనీష్ పాండే కీలక పాత్ర పోషించాడు. కీలకమైన వికెట్లు కోల్పోయిన స్థితిలో మనీష్ పాండే ఆర్థ సెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు. 

Also Read: కివీస్ పై చివరి టీ20: రాహుల్, కోహ్లీలకు రెస్ట్, రిషబ్ పంత్ కు చాన్స్

మ్యాచ్ ముగిసిన తర్వాత తన ప్రదర్శనపై మనీష్ పాండే మాట్లాడాడు. తన ఆట తీరుపై సంతృప్తిగా ఉన్నట్లు అతను చెప్పాడు. తాను ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి విలువైన పరుగులు చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. ఇప్పుడు తనది ఆరో స్థానమనే ఫిక్స్ అయ్యాయని చెప్పాడు. 

ఆ రకంగా తాను సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపాడు. తనకు ముందు వరుసలో రావడానికి చాయిస్ లేదని చెప్పాడు. ప్రస్తుతం ఆ స్థానంలో ఆడడానికి మానసికంగా సన్నద్ధమవుతున్నట్లు తెలిపాడు. తాను సాధారణంగా మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ఉంటానని, అయితే ఇప్పుడు ఆ స్థానాలకు పోటీ చాలా ఉందని, దాంతో దిగువన రావాల్సి వస్తోందని, అవకాశాల కోసం ఎదురు చూడకతప్పదని మనీష్ పాండే అన్నాడు.

Also Read: చాహల్ టిక్ టాక్ డ్యాన్స్ వీడియో: శ్రేయస్ తో కలిసి గడ్డం స్టెప్