కివీస్ పై చివరి టీ20: రాహుల్, కోహ్లీలకు రెస్ట్, రిషబ్ పంత్ కు చాన్స్
న్యూజిలాండ్ పై జరిగే చివరిదీ ఐదోది అయిన టీ20 మ్యాచులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, బుమ్రా ఆడే అవకాశాలు లేవు. కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ కు తుది జట్టులో అవకాశం దక్కవచ్చు.
హామిల్టన్: ప్రపంచ కప్ లక్ష్యంగా జట్టును కూర్పు చేసుకునేందుకు న్యూజిలాండ్ పై జరిగే ఐదో ట్వంటీ20 మ్యాచులో టీమిండియా ప్రయోగాలకు సిద్ధపడుతోంది. న్యూజిలాండ్ పై జరుగుతున్న టీ20 సిరీస్ లో ఇది చివరిది. ఇప్పటికే ఇండియా నాలుగు మ్యాచుల్లో గెలిచి సిరీస్ ను సొంతం చేసుకుంది. చివరి మ్యాచును కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది.
ఆదివారంనాడు ఇరు జట్ల మధ్య చివరి టీ20 జరగనుంది. ఐదో ర్యాంకులో కొనసాగుతున్న ఇండియా చివరి టీ20లో విజయం సాధించి మరో మెట్టు ఎక్కాలని తాపత్రయపడుతోంది. అదే సమయంలో ప్రయోగాలకు కూడా సిద్ధపడుతోంది.
Also Read: రియల్ క్రేజీ గేమ్: ఇండియా సూపర్ ఓవర్ విన్ పై రవిశాస్త్రి
ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్ ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి కల్పించే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. సంజూ శాంసన్, శివం దూబేలకు మరో అవకాశం ఇవ్వనున్నారు.
నాలుగో టెస్టుకు రోహిత్ శర్మ, మొహమ్మద్ షమీ దూరంగా ఉన్నారు. విరాట్ కోహ్లీ, బుమ్రా స్థానాల్లో వారు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ జట్టుకు సారథ్యం వహిస్తాడు. రిషబ్ పంత్ గాయపడడం కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో కేఎల్ రాహుల్ అదనంగా వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా తీసుకున్నాడు. అప్పటి నుంచి అతనే వికెట్ కీపింగ్ చేస్తున్నాడు.
Also Read: రాహుల్ చెప్పిన మాటతోనే...: కివీస్ పై సూపర్ విన్ మీద కోహ్లీ స్పందన ఇదీ.
భారత్ కు 2019 - 20 సీజన్ ఇదే ఆఖరి ట్వంటీ20 సిరీస్. మార్చి చివరలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఉంటుంది. ఆ తర్వాత శ్రీలంక సిరీస్ ప్రారంభమవుతుంది.