కేఎల్ రాహుల్ రిటైర్మెంట్.. సంచలనం రేపుతున్న పోస్టు.. !

KL Rahul Retirement: భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ పేరిట ఇన్‌స్టా స్టోరీ వైరల్ అవుతోంది. కేఎల్ రాహుల్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇదే విష‌యం క్రికెట్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 
 

Has Indian wicketkeeper-batsman KL Rahul announced his retirement from cricket? A sensational post RMA

KL Rahul Retirement: భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన వికెట్ కీప‌ర్ బ్యాటర్లలో ఒక‌రు. అద్భుత‌మైన ఆట‌తో భార‌త జ‌ట్టుకు అనేక విజ‌యాలు అందించిన ప్లేయర్. ఇటీవ‌ల ముగిసిన టీ20 ప్ర‌పంచ క‌ప్ జ‌ట్టులో స్థానం ల‌భిస్తుంద‌ని అంద‌రూ భావించారు కానీ, అది జ‌ర‌గ‌లేదు. ఇప్పుడు కేఎల్ రాహుల్ రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ట్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ గా కొన‌సాగుతున్న కేఎల్ రాహుల్ గత రెండు సంవత్సరాలుగా భార‌త టీ20 జట్టులో స్థానం కోల్పోయాడు.

ఇప్పుడు తాజాగా కేఎల్ రాహుల్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో భారీ ఊహాగానాలకు తెర‌లేపింది. కేఎల్ రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ముఖ్యమైన ప్రకటన చేయ‌బోతున్నాన‌నీ, దాని కోసం చూస్తూ ఉండండి అంటూ పేర్కొన్నాడు. ఈ ప్రకటన అతని క్రికెట్ భవిష్యత్తుతో పూర్తిగా సంబంధం ఉందా?  లేదా అనే విష‌యంతో తెలియ‌క‌పోవ‌డంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

షారుఖ్ ఖాన్ ను కాద‌ని భార‌త స్టార్ క్రికెట‌ర్ ను పెళ్లి చేసుకుంటానన్న ప్రియాంక చోప్రా..

టీ20 ప్రపంచ కప్ 2024లో రాహుల్ భారత జట్టులో భాగం కాదు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని గెలిచిన త‌ర్వాత స్టార్ ప్లేయ‌ర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు ఈ ఫార్మాట్ నుంచి తమ రిటైర్మెంట్‌ను ప్రకటించారు. రాహుల్ కూడా అదే తరహాలో నిర్ణయం తీసుకుంటున్నారా? అనే చ‌ర్చ సాగుతోంది. కేఎల్ రాహుల్ ప్ర‌స్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు లక్నో సూపర్ కెప్టెన్‌గా, వికెట్ కీపర్ బ్యాటర్ గా ఉన్నాడు. కానీ, రాబోయే సీజ‌న్ లో జ‌ట్టులో ఉండ‌టంపై సందేహాలు ఉన్నాయి. గ‌త సీజ‌న్ లో  ఆ జ‌ట్టు య‌జ‌మాని-కేఎల్ రాహుల్ అంశం క్రికెట్ వ‌ర్గాల‌ను క‌ల‌వ‌ర‌పెట్టిన సంగ‌తి తెలిసిందే.

దీంతో రాబోయే సీజ‌న్ మెగా వేలంలో రాహుల్‌ను వ‌దులుకుని కొత్త కెప్టెన్సీ ముఖాన్ని వెతకాలని ఫ్రాంఛైజీ నిర్ణయించవచ్చని చాలా మంది భావిస్తున్నారు. ఒక జ‌ట్టు స్క్వాడ్‌లో ఎంపికైన రాహుల్ దులీప్ ట్రోఫీలో ఆడనున్నాడు. త‌న జ‌ట్టులో మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్‌, శుభ్‌మన్ గిల్ వంటి ప్లేయ‌ర్లు ఉన్నారు. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టులోకి రావ‌డానికి కేఎల్ రాహుల్ కు రిషబ్ పంత్, ధృవ్ జురెల్ నుండి గట్టి పోటీ ఉంది. పంత్‌కు వికెట్ కీపర్ పాత్ర లభించే అవకాశం ఉన్నప్పటికీ, రాహుల్ నాన్-కీపర్‌గా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ద‌క్కించుకునే అవ‌కాశ‌మూ లేక‌పోలేదు. చూడాలి మ‌రి ప్ర‌స్తుత వార్త‌ల‌పై కేఎల్ రాహుల్ ఎలా స్పందిస్తారో.. !

 

 

డబుల్ పూర్తి చేశాడు.. ఇప్పుడు ట్రిఫుల్ సెంచ‌రీ.. ర‌వీంద్ర జ‌డేజా అరుదైన రికార్డు 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios