హార్ధిక్ పాండ్యా సిక్సర్ బాదడంతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్న తిలక్ వర్మ.. టీ20ల్లో సెంచరీలు తప్ప, హాఫ్ సెంచరీలను వ్యక్తిగత అఛీవ్‌మెంట్‌గా చూడరంటున్న హార్షా భోగ్లే... 

వెస్టిండీస్ టూర్‌లో వరుసగా రెండు టీ20ల్లో ఓడిన తర్వాత మూడో టీ20లో ఘన విజయం అందుకుంది టీమిండియా. సూర్యకుమార్ యాదవ్ సెన్సేషనల్ హాఫ్ సెంచరీతో పాటు తిలక్ వర్మ మరోసారి చక్కని బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. తొలి టీ20లో 39 పరుగులు చేసిన తిలక్ వర్మ, రెండో టీ20లో 51 పరుగులు చేశాడు. మూడో టీ20లో 49 పరుగులతో అజేయంగా నిలిచాడు..

తిలక్ వర్మ హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో ఉన్నప్పుడు టీమిండియా విజయానికి 2 పరుగులు కావాలి. అయితే స్ట్రైయికింగ్‌లో ఉన్న కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, సిక్సర్ బాది మ్యాచ్‌ని ముగించాడు. దీంతో హార్ధిక్ పాండ్యాను ‘సెల్ఫీష్’ అంటూ తీవ్రంగా ట్రోల్ చేశారు క్రికెట్ ఫ్యాన్స్...

తిలక్ వర్మ హాఫ్ సెంచరీ మిస్ అవ్వడంపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరిగింది. దీనిపై కామెంటేటర్ హర్షా భోగ్లే స్పందించాడు. 

Scroll to load tweet…

‘తిలక్ వర్మ 50 మిస్ అయిన దాని గురించి సోషల్ మీడియాలో ఇంత పెద్ద రాద్ధాంతం జరగడం నాకు వింతగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇది లాండ్‌ మార్క్ కాదు. నిజానికి టీ20ల్లో సెంచరీ తప్ప మరే లాండ్ మార్క్‌ ఉండవు. పొట్టి ఫార్మాట్‌లో సెంచరీ చేయడం చాలా రేర్ కాబట్టి దాన్ని రికార్డుగా భఆవిస్తారు..

క్రికెట్ అనేది టీమ్ స్పోర్ట్స్. ఇందులో వ్యక్తిగత అఛీవ్‌మెంట్స్‌కి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం కరెక్ట్ కాదు. నాకు తెలిసి టీ20 క్రికెట్‌లో హాఫ్ సెంచరీలు, వ్యక్తిగత గణాంకాలుగా రికార్డు అవుతాయని కూడా నేను అనుకోవడం లేదు. టీ20 ఫార్మాట్‌లో ఎన్ని పరుగులు చేశాం, ఎంత వేగంగా చేశామనేవి మాత్రమే ముఖ్యం. యావరేజ్, స్ట్రైయిక్ రేట్ రెండే చూస్తారు. మిగిలినవి పట్టించుకోరు.. అంతే..’ అంటూ ట్వీట్ చేశాడు హర్షా భోగ్లే..

హార్షా భోగ్లే ట్వీట్‌కి సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్ స్పందించాడు. ‘థ్యాంక్యూ థ్యాంక్యూ థ్యాంక్యూ.. మొత్తానికి ఎవరో ఒకరు ఈ విషయం చెప్పారు...’ అంటూ కామెంట్ చేశాడు ఏబీ డివిల్లియర్స్.. 

కరేబియన్ దీవుల్లో మొదటి మూడు టీ20 మ్యాచులు ఆడిన వెస్టిండీస్, ఇండియా... మిగిలిన రెండు టీ20 మ్యాచుల కోసం యూఎస్‌ఏ చేరుకున్నాయి. చివరి రెండు టీ20లు, ఫ్లోరిడాలోని మియామీలో జరుగుతాయి. ఆగస్టు 12, 13 తేదీల్లో వరుసగా రెండు టీ20లు ఆడే టీమిండియా, ఐర్లాండ్ టూర్‌కి బయలుదేరి వెళ్తుంది...

ఈ టూర్ ముగిసిన తర్వాత సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా అండ్ కో స్వదేశానికి తిరిగి వస్తారు. ఐర్లాండ్‌తో మూడు టీ20 మ్యాచుల సిరీస్‌‌కి జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. ఐర్లాండ్ టూర్ ముగిసిన తర్వాత నేరుగా శ్రీలంకకి వెళ్లి ఆసియా కప్ 2023 టోర్నీలో పాల్గొంటుంది భారత జట్టు.. 

వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో పర్ఫామెన్స్ కారణంగా తిలక్ వర్మకు ఆసియా కప్ 2023 టోర్నీలో బ్యాకప్ ప్లేయర్‌గా చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది.