మన సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో తెలుగు ప్లేయర్లు లేకపోయినా, పొరుగు రాష్ట్రంలో తమిళనాడుకి చెందిన చెన్నై సూపర్ కింగ్స్‌లో ఒకరికి ముగ్గురు తెలుగు ప్లేయర్లు ఉన్నారు. భారత సీనియర్ ప్లేయర్ అంబటిరాయుడిని అట్టిపెట్టుకున్న సీఎస్‌కే, తెలుగు కుర్రాళ్లు హరిశంకర్ రెడ్డి, భగత్ వర్మని కొనుగోలు చేసింది...

ప్రాక్టీస్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీని క్లీన్‌బౌల్డ్ చేసిన కడప కుర్రాడు హరిశంకర్ రెడ్డి తెలుగు వీడియో ఇంటర్వ్యూని పోస్టు చేసింది సీఎస్‌కే... రాయలసీమ యాసలో తన క్రికెట్ కష్టాల గురించి చెప్పుకొచ్చిన హరిశంకర్ రెడ్డి, నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ మూవీ చూసి చాలా కనెక్ట్ అయ్యానని చెప్పాడు.

తాను ఐపీఎల్‌కి సెలక్ట్ అయిన వెంటనే, ‘జెర్సీ’ మూవీలో ట్రైన్ సీన్ మాదిరిగానే గట్టిగా అరిచేశానంటూ చెప్పుకొచ్చాడు. నాని గారు ఈ వీడియో చూడండి అంటూ సీఎస్‌కే ట్యాగ్ చేయగా... దానికి నేచురల్ స్టార్ ‘చూసేశా’ అంటూ లవ్ సింబల్స్‌తో రిప్లై ఇచ్చాడు...