కొడుకు పుట్టిన ఆనందంలో తన సంతోషాన్ని అందరితో పంచుకుంటున్న హార్దిక్ పాండ్య... తాజాగా తమ సహచరి నటాషాకు గులాబీలతో శుభాకాంక్షలు తెలిపాడు హార్దిక్. తనకు బెస్ట్ గిఫ్ట్ ఇచ్చినందుకు తన గులాబీకి గులాబీలతో ధన్యవాదాలు అని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Roses for my rose 🌹 Thank you for giving me the best gift ever 🙏🏾❤️

A post shared by Hardik Pandya (@hardikpandya93) on Aug 2, 2020 at 7:52am PDT

ఇకపోతే... ఈ టీమిండియా విధ్వంసక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవల తండ్రైన సంగతి తెలిసిందే. ఆయనకు సహచరి నటి నటాషా‌ ఇటీవల పండంటి బాబుకు జన్మనిచ్చారు. కుమారుడిని చేతిని పట్టుకున్న ఫోటోను పాండ్యా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 

తాజాగా తన చిన్నారి బిడ్డను ప్రేమతో చేతుల్లోకి తీసుకుని తండ్రిగా ఉద్వేగానికి గురవుతున్న ఫోటోను శనివారం అభిమానులతో పంచుకున్నాడు.

 ‘‘ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ పెట్టాడు. దీంతో హార్దిక్‌కు క్రికెట్ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అనేక మంది హార్దిక్ పోస్టుకు లైకులు, కామెంట్‌లు చేయడంతో ప్రస్తుతం ఈ తండ్రి, కొడుకుల ఫోటో వైరల్‌గా మారింది.

ఇక  కొడుక్కి డైపర్లను తీసుకెళ్తున్నట్టుగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి, తండ్రి డ్యూటీస్ మొదలయ్యాయి అని రాసుకొచ్చాడు హార్దిక్.