ప్రపంచకప్ లో పాక్ చేతిలో భారత్ ఓటమి పాలైంది.  పది వికెట్ల తేడాతో టీమిండియాను పాక్ చిత్తు చిత్తుగా ఓడించడం గమనార్హం. 

T20 world cup లో భాగంగా ఆదివారం.. టీమిండియా పాకిస్తాన్ తో తలపడిన సంగతి తెలిసిందే. అయితే.. తొలిసారి.. ప్రపంచకప్ లో పాక్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. పది వికెట్ల తేడాతో టీమిండియాను పాక్ చిత్తు చిత్తుగా ఓడించడం గమనార్హం. కాగా.. ఈ సంగతి పక్కన పెడితే.. ఈ మ్యాచ్ నేపథ్యంలో.. టీమిండియా ఆల్ రౌండర్ Hardik pandya గాయంపాలయ్యాడు.

Also Read: ఆరెంజ్ క్యాప్ రాదనా, లేక అమ్మాయి అడిగిందనా... కెఎల్ రాహుల్‌పై బీభత్సమైన ట్రోలింగ్...

పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 11 పరుగుల వద్ద అతడి కుడి భుజానికి గాయమైంది. దీంతో అతడు ఫీల్డింగ్‎కు రాలేదు. అతడి స్థానంలో ఇషాన్ కిషన్ ఫీల్డింగ్ చేశాడు. హార్దిక్ ఎనిమిది బంతులు ఎదుర్కొని 11 పరుగలు చేశాడు. రవూఫ్ బౌలింగ్‎లో ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యాను ఎందుకైనా మంచిదని స్కానింగ్‎కు పంపారు. 28 ఏళ్ల ఆల్ రౌండర్ పాండ్యా గాయం జట్టుకు ఆందోళ కలిగిస్తోంది. బ్యాటింగ్ లైనప్‌లో హార్దిక్‌కు ఫినిషింగ్ ఆటగాడిగా ఉంటాడని కోహ్లీ భావించాడు. కానీ అతని గాయం ఆందోళన కలిగిస్తోంది.

Also Read: T20 worldcup 2021: టీమిండియా రికార్డు బ్రేక్... పాకిస్తాన్‌ చేతిలో ఘోర పరాభవం...

ఈ మ్యాచ్‎లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వికెట్లను కోల్పోయింది. పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది అద్భుతంగా బౌలింగ్ చేసి వారిని పెవిలియన్ కు చేర్చాడు. సూర్యకుమార్ యాదవ్ కొద్దిసేపటికే వెనుదిరిగాడు. దీంతో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పంత్ 32 పరుగులు చేసి ఔటవగా.. విరాట్ కోహ్లీ 57 పరులుగు చేసి 18వ ఓవర్ కీపర్‎కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

భారత్ నిర్ణీత 20 ఓవరల్లో ఏడు వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన పాకిస్థాన్‌ ఓపెనర్ల దూకుడుకు టీమిండియా చేతులెత్తేసింది. పాకిస్థాన్‌ ఓపెనర్లు రిజ్వాన్‌, అజమ్‌లు భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టించారు. అసలు ఎక్కడ తడబడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. భారత్‌ ఇచ్చిన 152 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాకిస్థాన్‌ సునాయాసంగా చేధించింది. ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా పాక్‌ జయ కేతనాన్ని ఎగరవేసింది.