దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దానిని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ తో క్రీడా ప్రపంచం మొత్తం పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబంతో కాలక్షేపం చేస్తున్నారు.
కాగా.. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రం తన ప్రేయసి నటాషాతో సరదాగా గడుపుతున్నాడు. లాక్ డౌన్ సమయంలో వీరిద్దరూ కలిసి చేస్తున్న సందడిని వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

తాజాగా హార్దిక్ పాండ్యా ఓ పాట కచేరి పెట్టాడు. బాలీవుడ్ సినిమా కేసరీలోని ‘ తేరీ మిట్టీ’ అనే పాటను ఆలపించాడు. కాగా.. ఆ పాట పాడే సమయంలో తన సోదరుడు క్రునాల్ సహాయం కూడా తీసుకున్నాడు. కాగా.. ఇద్దరూ కలిసి పాట అదరగొట్టారు. ఈ వీడియోని హార్దిక్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#PandyaBrothers karaoke time 🎤 lockdown special 💫 @krunalpandya_official

A post shared by Hardik Pandya (@hardikpandya93) on May 17, 2020 at 6:56am PDT

 

కాగా.. వీరి పాట కచేరికి హార్దిక్ ప్రియురాలు నటాషా కూడా స్పందించింది. ‘ఓయ్ హోయి’ అని కామెంట్ పెట్టింది. దాని పక్కనే హృదయం ఆకారంలో ఉన్న ఓ ఎమోజీని కూడా పెట్టింది. హార్దిక్ పాటకు తాను ఫిదా అయ్యానంటూ ఎమోజీలతోనే చెప్పేసింది. ఆమె సమాధానం కూడా ఇప్పుడు అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. వీరిద్దరూ ఎంత పీకల్లోతు ప్రేమలో ఉన్నారో సోషల్ మీడియాలో చెప్పకనే చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. గతంలోనూ వీరిద్దరూ తమకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొద్ది రోజుల క్రితం పెట్టిన ఓ వీడియోకి అభిమానులు ఫిదా అయిపోయారు. 

హార్దిక్.. తన ప్రేయసి నటాషాతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. కాగా.. అతను తన ప్రేయసికి ప్రేమ పరీక్ష పెట్టాడు. ‘‘ బేబీ.. నేను నీకు ఏమౌతాను’’ అంటూ హార్దిక్.. నటాషాను ప్రశ్నించాడు. దానికి ఆమె అదిరిపోయే సమాధానం చెప్పింది. ‘‘ నువ్వు నా హృదయంలో ఒక భాగం’’ అంటూ ఆమె సమాధానం ఇచ్చింది. వారి ప్రేమ ఎంత గొప్పదో ఆమె సమాధానంతో తేలిపోయింది.

వీరు ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వైరల్ గా మారింది. అభిమానులు టోటల్ గా ఫిదా అయిపోయారు. కాగా.. గతంలో ఈ లాక్ డౌన్ సమయంలోనే నటాషా.. తన ప్రియుడు హార్దిక్ కోసం కేక్ కూడా తయారు చేసింది.
ఇదిలా ఉండగా.. లాక్ డౌన్ కారణంగా అందరం ఇళ్లకే పరిమితమవ్వగా.. దేశం కోసం కృషి చేస్తున్న వారికి హార్దిక్ హ్యాట్సాప్ తెలియజేశాడు. 

క‌రోనా వైర‌స్‌పై త‌మ ప్రాణాల‌ను కూడా లెక్క‌చేయ‌కుండా పోరాడుతున్న పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు తాను సెల్యూట్ చేస్తున్నాని భార‌త ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు.  కొవిడ్-19 కార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రు ఇండ్ల‌కే ప‌రిమిత‌మైన వేళ‌..వీధుల్లో విధులు నిర్విర్తిస్తున్న పోలీసుల ప‌నితీరును పాండ్యా ప్ర‌శంసించాడు. ట్విట్ట‌ర్‌లో ముంబై పోలీసులు షేర్ చేసిన వీడియోను రీట్వీట్ చేస్తూ పాండ్యా ఇలా రాసుకొచ్చాడు. 
‘ మ‌మ్మ‌ల్ని కాపాడ‌టానికి దేశ‌వ్యాప్తంగా నిరంతరం శ్రమిస్తున్న సిబ్బందితో పాటు ముంబై పోలీసుల‌కు నేను క్రుతజ్ఞ‌త‌లు తెలుపుతున్నాను’ అని రాసుకొచ్చాడు.