హార్దిక్ సెల్ఫిష్ గా ప్రవర్తించడం వల్ల తిలక్ హాఫ్ సెంచరీ మిస్ అయ్యిందని తిట్టిపోస్తున్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిసినప్పటికీ, హార్దిక్ కి విమర్శలు తప్పకపోవడం గమనార్హం.
వెస్టిండీస్‌తో జరిగిన టీ20ఐ సిరీస్ లో టీమిండియా అదరగొట్టింది. అయితే, ఈ సిరీస్ లో భారత కెప్టెన్, హార్దిక్ పాండ్యా గత కొన్ని రోజులుగా సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో జట్టు పేలవమైన ప్రదర్శనలకు సంబంధించి అనేక విమర్శలకు గురయ్యాడు. సరిగా ఆడలేదు అని ఇప్పటికే తీవ్ర విమర్శలకు గురయ్యాడు. తాజాగా మూడో సిరీస్ లో అతను చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. హార్దిక్ చాలా సెల్ఫిష్ గా ప్రవర్తించాడని తిట్టిపోస్తుున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే... హార్దిక్ సెల్ఫిష్ గా ప్రవర్తించడం వల్ల తిలక్ హాఫ్ సెంచరీ మిస్ అయ్యిందని తిట్టిపోస్తున్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిసినప్పటికీ, హార్దిక్ కి విమర్శలు తప్పకపోవడం గమనార్హం.
భారత జట్టు 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో, నాన్-స్ట్రైకర్ తిలక్ వర్మ తన హాఫ్ పూర్తి చేయడానికి 1 పరుగు మాత్రమే కావాల్సి ఉన్నప్పటికీ, హార్దిక్ ఛేజింగ్‌ను ముగించడానికి మ్యాచ్ చివరి బంతికి సిక్స్ కొట్టాడు. అదే హార్దిక్ తాను సిక్స్ కొట్టడం కాకుండా, తిలక్ కి ఛాన్స్ ఇచ్చి ఉంటే, అతనికి హాఫ్ సెంచరీ పూర్తయ్యేది కదా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తన ఖాతాలో సిక్స్ వేసుకోవడానికి, తిలక్ రికార్డు చేయకుండా ఆపేశాడంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం హార్దిక్ పై విమర్శల వర్షం కురుస్తోంది. హార్దిక్ చేసిన చర్యను ట్విట్టర్‌లో అభిమానులు 'స్వార్థం' అని ముద్ర వేశారు.
