కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్ సమయాన్ని టీమిండియా క్రికెటర్లు బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. వారిలో టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా ముందు వరసలో ఉంటాడు. లాక్ డౌన్ కి ముందు తన ప్రేమ విషయాన్ని అందరికీ చెప్పి షాకింగ్ కి గురిచేసిన హార్దిక్.. లాక్ డౌన్ సమయంలో తాను తండ్రి కాబోతున్నానంటూ మరో న్యూస్ చెప్పాడు. 

ఆ తర్వాత తన ప్రేయసి నటాషాతో సమయం గుడుపుతున్న ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఉత్సాహపరిచేవాడు. కొద్ది రోజుల క్రితం తన ఫిట్నెస్ లెవల్స్ ని ఓ వీడియో ద్వారా అభిమానులకు పరిచయం చేశాడు. కండలు తిరిగిన శరీరంతో పాండ్యా కఠినమైన వ్యాయామాన్ని సునాయాసంగా చేశాడు. పుష్ అప్స్ చేయడమే కాకుండా.. ఒకచోటు నుండి మరోచోటుకి వెళుతూ చేయడం ఇక్కడ విశేషం. 

ఇలా ఎప్పటికప్పుడు.. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంలో.. హార్దిక్ ముందుంటాడు. అయితే.. తాజాగా.. ఓ ఫోటోని హార్దిక్ అభిమానుల కోసం షేర్ చేశాడు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Family 💫💝 Photographer- @rahuljhangiani Hardik’s stylist - @nikitajaisinghani Natasa’s stylist - @soodpranav

A post shared by Hardik Pandya (@hardikpandya93) on Jul 16, 2020 at 11:45pm PDT

 

ఆ ఫోటోలో హార్దిక్ ఒడిలో నటాషా పడుకొని ఉండగా.. మరోవైపు వారు ప్రేమగా పెంచుకుంటున్న మూడు కుక్క పిల్లలు కూడా ఉన్నాయి. ఆ ఫోటోచూడటానికి చాలా అందంగా ఉంది. ఆ ఫోటోని షేర్ చేసిన హార్దిక్ దానికి క్యాప్షన్ గా ఫ్యామిలీ అని రాసుకొచ్చాడు.

దీంతో.. అభిమానులు ఆ ఫోటోకి ఫిదా అయిపోయారు. మీ ఫ్యామిలీ ఫోటో అదుర్స్ అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా...త్వరలోనే హార్దిక్, నటాషా దంపతులు ఓ బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఇటీవలే నటాషా బేబీ షవర్ కార్యక్రమం కూడా పూర్తి చేశారు. ఆ ఫోటోలతోనే తాను తండ్రి కాబోతున్నాను అన్న విషయం హార్దిక్ రివీల్ చేసి షాకిచ్చాడు.