Asianet News TeluguAsianet News Telugu

హార్దిక్ పాండ్యా పూజ‌లు ఫ‌లిస్తాయా.. ముంబై గెలుపు ట్రాక్ లోకి వ‌స్తుందా..?

Hardik Pandya : ఏప్రిల్ 1న రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి తర్వాత స్వల్ప విరామంలో ఉన్న ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 7న సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. ఈ క్ర‌మంలోనే ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాల్లో ఒక‌టైన సోమ‌నాథ ఆల‌యంలో పూజ‌లు నిర్వ‌హించాడు. 
 

Hardik Pandya perform puja at Somnath shrine, Will Mumbai Indians get back on track to win?  RMA
Author
First Published Apr 5, 2024, 9:46 PM IST

Hardik Pandya : టీమిండియా స్టార్ ఆల్ రౌండ‌ర్, ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఐపీఎల్ 2024 సీజ‌న్ ప్రారంభం తీవ్ర త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టింది. త‌న కెప్టెన్సీలో ముంబై ఆడిన మూడు మ్యాచ్ ల‌లో చిత్తుగా ఓడింది. దీనికి తోడు కెప్టెన్ గా చాలా త‌ప్పుడు నిర్ణ‌యాలే ముంబై ఓట‌మికి కార‌ణాలుగా విశ్లేకులు, సీనియ‌ర్ ప్లేయ‌ర్లు అభిప్రాయ‌ప‌డ్డారు. దీనికి తోడు ఫీల్డింగ్ స‌మ‌యంలో రోహిత్ శ‌ర్మ‌తో న‌డుచుకున్న తీరు, ల‌సింగ్ మ‌లింగాతో గొడ‌వ ఇలా ప‌లు వివాదాల‌తో హార్దిక్ పాండ్యా అభిమానుల ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. సోష‌ల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ తో హార్దిక్ ను ఆటాడుకున్నారు.

ఇలాంటి అనేక విష‌యాల ప్రభావ‌మో, లేక కాస్త విరామం దొరికింద‌నో హార్దిక్ పాండ్యా గుజరాత్‌లోని వెరావల్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశాడు. హిందూ దేవుడైన శివుని  పన్నెండు జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలలో మొదటిది.. చాలా ప‌విత్ర మైన ఆల‌యం. ఏప్రిల్ 1న రాజస్థాన్ రాయల్స్‌తో ఓడిపోవడంతో ప్రస్తుతం కొద్దిసేపు విరామంలో ఉన్న ముంబై ఇండియన్స్, ఏప్రిల్ 7న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తమ సొంత మైదానంలో తిరిగి ఆడాల్సి ఉంది. మ్యాచ్‌ల మధ్య విరామాన్ని ఉపయోగించుకుని, పాండ్యా తన కెప్టెన్సీ క‌ష్టాలు పోవాల‌ని, జ‌ట్టు గెలుపుబాట‌లోకి రావాల‌ని పూజ‌లు చేసిన‌ట్టున్నారు. వ‌రుస ఓట‌ముల‌తో ఉన్న ముంబ‌యి జ‌ట్టు హార్దిక్ పూజ‌ల‌తో గెలుపు ట్రాక్ లోకి వ‌స్తుందో లేదో చూడాలి. ప్ర‌స్తుతం పాండ్యా సోమ‌నాథునికి చేసిన ప్ర‌త్యేక పార్థ‌న‌ల దృశ్యాలు వైర‌ల్ గా మారాయి.

రావడం రావడమే ఉతికిపారేస్తున్నారు.. ఇదెక్కడి ఆటరా సామి.. !

కాగా, హార్దిక్ పాండ్యా ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన మొద‌టి సీజ‌న్ లోనే గుజ‌రాత్ టైటాన్స్ ను ఛాంపియ‌న్ గా నిలిపాడు. ఆ త‌ర్వాతి సీజ‌న్ లో ఫైన‌ల్ కు తీసుకెళ్లిన కెప్టెన్ గా ఘ‌న‌త సాధించాడు. ఊహించ‌ని విధంగా టీమ్స్ ట్రేడింగ్ ద్వారా గుజ‌రాత్ నుంచి ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఆ త‌ర్వాత ముంబై సార‌థిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. కానీ, జ‌ట్టును గెలుపుబాట‌లోకి తీసుకురావ‌డంలో చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు. సొంత‌టీమ్ అభిమానుల నుంచే తీవ్రంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటూ ట్రోలింగ్ కు గుర‌వుతున్నాడు.

SURYAKUMAR YADAV: వ‌చ్చేశాడు.. అద‌ర‌గొడుతానంటున్న ముంబై సూప‌ర్ స్టార్.. !

Follow Us:
Download App:
  • android
  • ios