Hardik Pandya Natasa Stankovic Divorce : హార్దిక్ పాండ్యా-నటాసా స్టాంకోవిచ్ లు త‌మ నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు ప‌లికారు. ఈ విషయాన్ని హార్దిక్, నటాషా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ అభిమానులకు తెలియజేశారు.  

Hardik Pandya Natasa Stankovic Divorce : టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, సెర్బియా మోడ‌ల్ నటాసా స్టాంకోవిచ్ లు విడాకులు తీసుకున్నారు. త‌మ నాలుగేళ్ల వివాహ బంధాన్ని తెంచుకుంటున్నామ‌ని వీరిద్ద‌రూ సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించారు. త‌మ వివాహ బంధం గురించి హార్దిక్, నటాషా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ అభిమానులకు తెలియజేశారు. గత 6 నెలలుగా వీరిద్దరి మధ్య బంధంలో అడ్డంకులు మొద‌ల‌య్యాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. వీరు విడాకులు తీసుకుంటున్నార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. కానీ ఎవ‌రూ కూడా దీనిపై స్పందించ‌లేదు. కానీ, ఇప్పుడు అధికారికంగా విడాకుల‌ను ధృవీక‌రించారు. 

గత 4 సంవత్సరాలుగా ఇద్దరూ కలిసి ఉన్నారు, కానీ ఇప్పుడు వీరి బంధం విచ్ఛిన్నమైంది. నటాషా-హార్దిక్ చాలా నెలలుగా తమ రిలేషన్ షిప్ క్షీణించ‌డం గురించి మౌనంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాలో హార్దిక్ పాండ్యా ఎమోష‌న్ పోస్టు చేశారు. త‌న‌ పోస్ట్‌లో.. '4 సంవత్సరాలు కలిసి జీవించిన త‌ర్వాత‌.. నటాషా-నేను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మేము కలిసి మా వంతు ప్రయత్నం చేసాము.. మా ఉత్తమమైనదాన్ని అందించాము.. ఇది మా ఇద్దరికీ ఉత్తమమైనదని మేము నమ్ముతున్నాము. ఇది మాకు కష్టమైన నిర్ణయం ఎందుకంటే మేము కలిసి మెలిసి, పరస్పర గౌరవం-సాంగత్యాన్ని ఆస్వాదించాము. త‌ర్వాత‌ మా కుటుంబం కూడా పెరిగింది' అని పేర్కొన్నాడు. 

కొడుకు అగస్త్య ఎవరితో ఉంటాడు?

హార్దిక్-న‌టాషాల‌కు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కొడుకు అగస్త్య గురించి హార్దిక్ త‌న పోస్టులో.. "అగస్త్యతో మేము ఆశీర్వదించబడ్డాము, అతను మా ఇద్దరి జీవితాలకు కేంద్రంగా ఉంటాడు. అతని ఆనందం కోసం మేము చేయగలిగినదంతా ఇచ్చేలా మేము అతనికి సహ-తల్లిదండ్రులుగా ఉంటాము. ఈ కష్టమైన, సున్నితమైన సమయంలో మాకు గోప్యతకు మీ మద్దతు, అవగాహనను మేము హృదయపూర్వకంగా కోరుతున్నాము" అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.

SHUBMAN GILL: శుభ్‌మ‌న్ గిల్ పై మనసుపారేసుకున్న స్టార్ హీరోయిన్.. !