టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కాబోయే భార్య నటాషా జూలై 30న మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ ప్రపంచంలోకి తమ కొడుకును తీసుకువచ్చినందుకు ఆసుపత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ హార్దిక్ దంపతులు వేడుక చేసుకున్నారు.

అయితే అందరూ అనుకున్నట్లుగా జూనియర్ హార్దిక్ ముంబైలో జన్మించలేదు. గుజరాత్‌లోని ఆనంద్‌లో ఆకాంక్ష ఆసుపత్రిలో పుట్టాడు. సురక్షితంగా అతడిని తమ చేతుల్లోకి పట్టిన వైద్యులకు హార్దిక్ దంపతులు ధన్యవాదాలు తెలుపుతూనే, తమ జీవితాల్లోకి అడుగుపెట్టిన చిన్నోడికి స్వాగతం పలుకుతూ అదే ఆసుపత్రిలో సెలబ్రేట్ చేసుకున్నారు.

Also Read:తండ్రిగా కొత్త డ్యూటీ.. సోషల్ మీడియాలో హార్దిక్ ఫోటోలు వైరల్

వైద్యులకు కృతజ్ఞతలు చెబుతూ.. వారి సమక్షంలోనే కేక్ కట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. కాగా దుబాయ్‌లోని యాచ్‌లో హార్దిక్ నటాషాకు తన ప్రేమ విషయం వెల్లడించారు.

ఆమె ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ఏడాది వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. బాలీవుడ్ నటిగా రాణిస్తోన్న నటాషా బిగ్‌బాస్ 8 రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఆమె చివరి సారిగా టీవీ నటుడు ఏలీ గోనీతో కలిసి ‘‘ నాచ్ బలియే 9’’ డ్యాన్స్ షోలో పాల్గొన్నారు.