భారత క్రికెట్ ఆల్‌రౌండర్ బ్రదర్స్ హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా కన్నుమూశారు. భారత జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా, మంచి ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్న కృనాల్ పాండ్యా క్రికెట్‌లో రాణించడానికి వారి తండ్రి హిమాన్షు పాండ్యా ఎన్నో కష్టాలను అనుభవించి, కొడుకులకు కావాల్సిన సదుపాయాలను సమకూర్చారు.

కొన్నాళ్లుగా గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న హిమాన్షు, గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న బరోడా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 నుంచి తప్పుకున్నాడు.. 

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ ఆరంభానికి ముందు వైస్ కెప్టెన్ దీపక్ హుడా, బరోడా కెప్టెన్ కృనాల్ పాండ్యాపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనను బూతులు తిడుతూ అసభ్యంగా ప్రవర్తించాడంటూ కృనాల్ పాండ్యాపై ఫిర్యాదు చేసిన దీపక్ హుడా, సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీ నుంచి తప్పుకున్నాడు.