Asianet News TeluguAsianet News Telugu

కండలు తిరిగిన దేహం.. చెమటలు చిందిస్తున్న హార్దిక్ పాండ్యా

జిమ్ లో కసరత్తులు చేసి.. చెమటలు చిందించాడు. ఈ ఫోటోలో పాండ్యా కండలు తిరిగిన దేహం స్పష్టంగా కనపడుతోంది. ఈ ఫోటోని హార్దిక్ పాండ్యా.. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశాడు.

Hardik Pandya Has "Work Mode On" In This Post-Workout Pic
Author
Hyderabad, First Published Jun 22, 2021, 10:21 AM IST

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన గురించి.. తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. కాగా.. తాజాగా.. పాండ్యా.. తన వర్కౌట్స్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. 

జిమ్ లో కసరత్తులు చేసి.. చెమటలు చిందించాడు. ఈ ఫోటోలో పాండ్యా కండలు తిరిగిన దేహం స్పష్టంగా కనపడుతోంది. ఈ ఫోటోని హార్దిక్ పాండ్యా.. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశాడు. దానికి క్యాప్షన్ గా ‘ వర్క్ మోడ్ ఆన్’ అంటూ షేర్ చేశాడు. వర్కౌట్స్ చేసిన తర్వాత.. మిర్రర్ లో చూసుకుంటూ.. నవ్వుతూ హార్దిక్ ఈ ఫోటో క్లిక్ మనిపించాడు.

Hardik Pandya Has "Work Mode On" In This Post-Workout Pic

కాగా.. హార్దిక్ చివరగా.. ఐపీఎల్ 2021సీజన్ లో దర్శనిచ్చాడు. ఈ ఐపీఎల్ సీజన్ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా.. వచ్చే నెల శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. ఈ సీరిస్ కి హార్దిక్ పేరు కూడా ఉంది.  మొత్తం మూడు వన్డే మ్యాచ్ లు, మూడు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లు జరగనున్నాయి. కొలంబో వేదికగా ఈ మ్యాచ్ లు జరగనున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios