టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇటీవల తండ్రైన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే నటాషా.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే.. ఈ విషయాన్ని హార్దిక్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అంతేకాదు.. బాబుతో, నటాషాతో కలిసి ఆనందం పంచుకుంటున్న ఫోటోలను కూడా షేర్ చేశాడు.

కాగా.. తాజాగా.. నటాషా.. కొడుకుతో దిగిన ఓ అందమైన ఫోటోని షేర్ చేసింది. బాబుని పైకి ఎత్తుకొని చూసుకొని మురిసిపోతోంది. ఆ ఫోటోని నటాషా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. హార్దిక్ రిప్లై అదిరిపోయింది. కామెంట్ గా హార్ట్ సింబల్స్ ని హార్దిక్ పోస్టు చేశాడు. నటాషా, బాబుపై తనకున్న ప్రేమను హార్దిక్ తెలియజేశాడు.

ఆ ఫోటోకి నటాషా పెట్టిన క్యాప్షన్ కూడా అదిరిపోయింది. ‘‘ నిన్ను ఎత్తుకున్నప్పుడు జీవితానికో అర్థం కలుగుతుంది’’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ జత చేసింది. దానికి మమ్మాస్ బాయ్, బ్లెస్సింగ్స్  అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

When I hold you, life makes sense. ❤️❤️❤️🤱🏻 #mamasboy #blessings

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on Aug 12, 2020 at 2:46am PDT

 

ఇదిలా ఉండగా... హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా సైతం చిన్నారితో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నాడు. శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో బుడ్డోడితో కలిసి వున్న జిఫ్‌ను పోస్ట్ చేశాడు.

క్రికెట్ గురించి మాట్లాడు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్‌కు టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కావాలని దయచేసి అతనికి చెప్పు ’’  అని కామెంట్ పెట్టాడు.

ప్రస్తుతం రాహుల్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హార్దిక్ పాండ్యా ప్రియురాలు, సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిక్ జూలై 30న మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని హార్దిక్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

మరోవైపు పాండ్యా, కేఎల్ రాహుల్ ఐపీఎల్‌కు సన్నద్ధమవుతున్నారు. పాండ్యా ముంబై ఇండియన్స్‌కి, రాహుల్ పంజాబ్ తరపున ఆడుతున్నారు. అలాగే కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.