IPL 2024: టాస్ సమయంలో హార్దిక్ పాండ్యాఫై ఫ్యాన్స్ ఫైర్.. అసలేం జరిగిందంటే..?
IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చింది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ. కానీ, పాండ్యా కెప్టెన్సీ ఆడిన మూడు మ్యాచ్ లోనూ ముంబై ఓటమి పాలైంది. దీంతో ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవుతోంది.
IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆడిన మూడు మ్యాచ్ లలో హర్థిక్ పాండ్యా సేన ఓటమి పాలైంది. ఈ సీజన్‍లో రోహిత్ శర్మ నుంచి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేపట్టాక తొలిసారి ముంబై ఇండియన్స్ .. తన హోం గ్రౌండ్ వాంఖడే స్టేడియంలో ఆడింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ వేసే సమయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఇప్పుడూ అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
అసలేం జరిగింది ?
IPL 2024 14వ మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య వాంఖడే స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ సందర్భంగా జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో అభిమానుల దృష్టిని ఆకర్షించింది. వాస్తవానికి. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించింది ముంబై ఇండియన్స్. ఈ నిర్ణయంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ యే కాదు.. ముంబై ఫ్యాన్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో తొలిసారి (సోమవారం) హోం గ్రౌండ్ వాంఖడేలో రాజస్థాన్ తో తలపడింది. అయితే, హార్దిక్ పాండ్యా టాస్‍కు వచ్చిన సమయంలో ముంబై ఫ్యాన్స్ అతనికి షాక్ ఇచ్చారు.
టాస్ సమయంలో కెప్టెన్ హార్దిక్ ప్రెజెంటర్ వద్దకు వెళ్లినప్పుడు.. ప్రేక్షకులు బూ అని గట్టిగా అరిచారు. దీంతో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కల్పించుకున్నారు. అభిమానుల ఆదరణపై సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ- ఇద్దరు కెప్టెన్లు నాతో ఉన్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. దయచేసి అతని కోసం చప్పట్లు కొట్టండి. ప్రేక్షకులు మర్యాదగా ప్రవర్తించాలని, హార్దిక్‍ను అభినందించాలని కోరారు. ఇందుకు సంబంధిచి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
మంజ్రేకర్ ఈ ప్రకటన తర్వాత హార్దిక్ నవ్వుతూ కనిపించాడు. అదే సమయంలో టాస్ సమయంలో మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న రోహిత్‌ను కెమెరామెన్ తెరపైకి తీసుకురాగా.. అభిమానులు పెద్దఎత్తున కేరింతలు కొడుతూ సందడి చేశారు. అసలే హార్దిక్‌ను ముంబై కెప్టెన్‌గా నియమించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్‌ని మళ్లీ కెప్టెన్‌గా చేయాలని అతను డిమాండ్ చేశాడు, కానీ ఈ సంవత్సరం హార్దిక్ కెప్టెన్సీలో జట్టు ముందుకు వచ్చింది. అదే సమయంలో, కొన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి, అందులో హార్దిక్ రోహిత్‌ను ఫీల్డింగ్ స్థానానికి వెళ్లమని సలహా ఇస్తున్నట్లు కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో చర్చ మరింత జోరందుకుంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి. https://telugu.asianetnews.com/mood-of-andhra-survey