మార్కుల పేరిట విద్యార్థినులకు లైంగిక వేధింపులు.. కీచక ప్రొఫెసర్ అరెస్ట్

ల్యాబ్ మార్కులు కావాలంటే... తనతో గడపాల్సిందేనని విద్యార్థులను మానసికంగా, శారీరకంగా వేధించినట్లు బాధితులు చెబుతున్నారు. డా.నాగేశ్వరరావు గత కొన్నేళ్లుగా ఎన్‌ఆర్‌ఐ వైద్యకళాశాలలోని రేడియాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు

professor Arrested For Harassing mediacal students in NRI Medical college

మరో కీచక ప్రొఫెసర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులను మార్కుల పేరిట భయపెట్టి... వారిని లైంగికంగా వేధిస్తున్న ఓ కీచక ప్రొఫెసర్ గుట్టు రట్టయ్యింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని  చినకాకాని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో రేడియాలజీ విభాగం ప్రొఫెసర్ గా పనిచేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు వైద్య విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేశాడు.

ప్రొఫెసర్ పై ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో వైద్య విద్యార్థినులు ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ వీసీకి తన బాధను వివరించారు. దీంతో... ఆ కీచక ప్రొఫెసర్ పై చర్యలు తీసుకుంటూ వీసీ ఆదేశాలు జారీ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం మంగళగిరి కోర్టులో హాజరుపరచగా... అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్వీవీఎన్ లక్ష్మి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.

ఆస్తి కోసం తండ్రిని చంపిన కొడుకు... మెడకు టవల్ బిగించి.....

ల్యాబ్ మార్కులు కావాలంటే... తనతో గడపాల్సిందేనని విద్యార్థులను మానసికంగా, శారీరకంగా వేధించినట్లు బాధితులు చెబుతున్నారు. డా.నాగేశ్వరరావు గత కొన్నేళ్లుగా ఎన్‌ఆర్‌ఐ వైద్యకళాశాలలోని రేడియాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇదే కళాశాలలో చదువుతున్న రేడియాలజీ పీజీ వైద్య విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, మాట్లాడటం, రకరకాలుగా వేధించడం చేశారు. 

వేధింపులు తట్టుకోలేక విద్యార్థినులు ఎన్‌ఆర్‌ఐ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఎంసీఐ నిబంధనల మేరకు ప్రతి వైద్య కళాశాలలోనూ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ఏర్పాటు చేసి, అక్కడకు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయా అధ్యాపకులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ కళాశాల యాజమాన్యం ప్రొఫెసర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థినులు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ వీసీకి ఫిర్యాదు చేశారు.

తెలంగాణలో మరో ఘోరం: వివాహితపై గ్యాంగ్ రేప్, హత్య

వీసీ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. విచారణలో అతను నేరం చేసినట్లు రోజువు కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కూడా అతనిని అరెస్ట్ చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios