Hardik Pandya: "ఆ వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా  బాధించాయి"  

Hardik Pandya: భారతదేశ పర్యాటక రంగాన్ని కించపరిచేలా మాట్లాడిన మాల్దీవులు ఎంపీ జహీద్ రమీజ్‌పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు పరోక్షంగా మాల్దీవులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే..తాజాగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కూడా 'మాల్దీవులు వివాదం'పై స్పందించాడు.  

Hardik Pandya Amid Maldives Row Sad To See What s Being Said About India KRJ

Hardik Pandya: ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్‌ను సందర్శించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో మాల్దీవులు ఎంపీ జహీద్ రమీజ్‌ భారతదేశ పర్యాటక రంగాన్ని తక్కువగా చేసి, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీసింది. దీంతో ఆగ్రహించిన పలువురు భారతీయులు సోషల్ మీడియాలో మాల్దీవ్ మంత్రిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

నిజానికి.. మాల్దీవులు భారతీయులలో పర్యాటక ప్రదేశంగా చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం లక్షలాది జంటలు హనీమూన్ కోసం భారతదేశం నుండి మాల్దీవులకు వెళతారు, కానీ మాల్దీవుల మంత్రి యొక్క అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో బాధపడ్డ చాలా మంది భారతీయులు ఇప్పుడు వారి బుకింగ్‌లను రద్దు చేస్తున్నారు, వీటి స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అసలేం జరిగిందంటే.. ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ .. సముద్రంలో స్నార్కెలింగ్‌ చేసి.. సముద్ర అందాలను ఆస్వాదిస్తూ.. కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రధాని ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ..''లక్షద్వీప్‌ సౌందర్యం, ఇక్కడి ప్రజల మమకారం చూసి చాలా సంతోషించాను. ఇక్కడి ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం నన్ను మంత్రముగ్థుడ్ని చేశాయి. పర్యాటకులు లక్షద్వీప్‌ను కూడా వీక్షించండి'అని మోడీ ట్వీట్ చేశారు.

ఈ పోస్ట్ పై మాల్దీవులు ఎంపీ జహీద్‌ అవమానకరంగా స్పందించారు. భారత్‌‌పై తన అక్కసు వెళ్లగక్కాడు. పర్యాటకంలో మాల్దీవులతో భారత్ పోటీ పడలేదని అన్నారు. మాల్దీవులు అందించే సేవలు,  పరిశుభ్రత అందించలేరని, భారతదేశ గదుల్లో దుర్వాసన వస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  దీంతో మాల్దీవులను బహిష్కరించాలని, దేశంలోని ఐల్యాండ్స్‌లో పర్యటించాలని నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.

ఈ క్రమంలో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా కూడా మాల్దీవుల మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేఖించారు. లక్షద్వీప్ చిత్రాన్ని పంచుకోవడం ద్వారా ఈ సమస్యపై తన స్పందనను వ్యక్తం చేశాడు. హార్దిక్ పాండ్యా X లో ఇలా వ్రాశాడు. “భారతదేశం గురించి అవమానకరంగా మాట్లాడటం చాలా బాధాకరం. అద్భుతమైన సముద్రం, సుందరమైన తీర ప్రాంతాలు కలిగిన  లక్షదీవులను ఖచ్చితంగా ఓ సారైనా చూడాలి. నేను నా తదుపరి సెలవుల్లో తప్పకుండా ఇక్కడికి వెళ్తాను.' అని హార్దిక్ రాసుకొచ్చాడు.

 

మాల్దీవుల వివాదం నేపథ్యంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ఓ కీలక  ప్రకటన చేశాడు. సచిన్.. సింధుదుర్గ్ బీచ్‌ల యొక్క పలు చిత్రాలు,  వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఇలా వ్రాశాడు. “నేను సింధుదుర్గ్‌లో నా 50వ పుట్టినరోజు జరుపుకుని 250 రోజులకు పైగా అయ్యింది! ఈ తీరప్రాంత నగరం మాకు కావలసినవన్నీ అందించింది, ఇంకా చాలా ఎక్కువ. అద్భుతమైన ఆతిథ్యంతో కూడిన అందమైన వేదిక మాకు జ్ఞాపకాల నిధిని మిగిల్చింది. 

భారతదేశం అందమైన బీచ్‌లు , సహజమైన ద్వీపాలతో ఆశీర్వదించబడింది. మా “అతిథి దేవో భవ” తత్వశాస్త్రంతో, మనం కనుగొనడానికి చాలా ఉన్నాయి.” అని రాసుకోచ్చారు. వీడియోలో.. సచిన్ సముద్ర తీరంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. సచిన్ హాఫ్ ప్యాంట్, ఫుల్ షర్ట్,  క్యాప్ ధరించి బ్యాటింగ్‌ను ఆస్వాదించడం చూడవచ్చు. సచిన్ వీడియో పాతదే కావచ్చు కానీ మాల్దీవుల వివాదంతో ముడిపడి ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios