Asianet News TeluguAsianet News Telugu

కోహ్లీకి బుమ్రా...అతడికి నేను ఎప్పటికీ రుణపడివుంటాం: హర్బజన్ సింగ్

టీమిండియా యువ పేసర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా వెస్టిండిస్ పై హ్యాట్రిక్ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీమిండియా తరపున టెస్టుల్లో మొదటి హ్యాట్రిక్ సాధించిన హర్భజన్ అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు.  

Harbhajan Singh rewinds to his hat-trick moment as he praises Bumrah
Author
Jamaica, First Published Sep 2, 2019, 3:26 PM IST

వెస్టిండిస్ పర్యటనలో టీమిండియా అద్భుత విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. టీ20, వన్డే సీరిసుల్లో ఓటమన్నదే లేకుండా విజయాలను అందుకున్న కోహ్లీసేన టెస్ట్ సీరిస్ లోనూ అదే దిశగా పయనిస్తోంది. ఇప్పటికే మొదటి టెస్ట్ ను గెలుచుకున్న టీమిండియా రెండో టెస్ట్ లోనూ విజయంవైపు వడివడిగా దూసుకెళుతోంది. అయితే ఈ మ్యాచ్ లో భారత పేసర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా ఓ అద్భుతం చేశాడు. మొదటి  ఇన్నింగ్స్ లో హ్యాట్రిక్ ప్రదర్శనతో అదరగొట్టి భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. 

ఓ భారత బౌలర్ టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించి 13 ఏళ్లు అవుతోంది. అంతేకాకుండా టెస్టుల్లో హ్యట్రిక్ సాధించిన టీమిండియా బౌలర్లలో బుమ్రా మూడోవాడు. ఇలా అరుదైన ఘనతను అందుకున్న బుమ్రాకు మొట్టమొదట హ్యాట్రిక్ సాధించిన ఆటగాడు హర్బజన్ సింగ్ అభినందించాడు. 

''బుమ్రా హ్యాట్రిక్ లో కెప్టెన్ కోహ్లీ పాత్ర మరిచిపోలేనిది. అతడి వల్లే బుమ్రాకు ఈ ఘనత దక్కిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో బుమ్రా ఎప్పటికీ కోహ్లీకి రుణపడి  వుండాల్సిందే. 

నేను  ఆస్ట్రేలియాపై మొట్టమొదట హ్యాట్రిక్ ప్రదర్శన చేశాను. అయితే ఆ రికార్డు నా సహచరుడు  రమేష్ వల్లే సాధ్యమయ్యింది. ఎందుకంటే అతడు పట్టిన ఓ అద్భుత క్యాచ్ ఫలితంగానే నా ఖాతాలోకి హ్యాట్రికి చేరింది. అందువల్లే ఈ అరుదైన రికార్డును అందుకోవడంలో సహకరించిన రమేష్ కు నేను ఎప్పటికీ రుణపడివుంటాను. ఇప్పుడు కోహ్లీకి బుమ్రా రుణపడినట్లు'' అని హర్భజన్ వెల్లడించాడు.    

అంతకు ముందు ట్విట్టర్ ద్వారా కూడా భజ్జీ బుమ్రాను అభినందించాడు. '' హ్యట్రిక్ క్లబ్ లోకి బుమ్రాకు స్వాగతం. అద్భుతమైన స్పెల్ తో నువ్వు ఈ ఘనత సాధించావు. నిన్ను చూసి చాలా చాలా గర్వపడుతున్నా. నీ ప్రదర్శన ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.'' అంటూ ట్వీట్ చేశాడు. 

భారత్ తరఫున టెస్టుల్లో హ్యాట్రిక్ వికెట్స్ సాధించిన మూడో బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. అయితే అంతకుముందే హర్భజన్ సింగ్, ఇర్పాన్ పఠాన్ లు ఈ ఘనత సాధించారు. 2001 లో ఆస్ట్రేలియాపై భజ్జీ, 2006 లో పాకిస్థాన్ పై పఠాన్ హ్యాట్రిక్ ప్రదర్శన చేశారు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios