టీమిండియా వైస్ కెప్టెన్ , ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రోహిత్ శర్మ ను ముద్దుగా  అభిమానులు హిట్ మ్యాన్ అని పిలుచుకుంటారన్న విషయం మనకు తెలిసిందే. ఎలాంటి బాల్ నైనా సూపర్ షాట్ కొట్టడంలో రోహిత్ కి ఎవరూ సాటిలేరు. కాగా.. ఈ రోజు ఆయన 34వ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షల వర్షం కురుస్తోంది.

అభిమానులు, క్రికెటర్లు అందరూ సోషల్ మీడియా వేదికగా హిట్ మ్యాన్ కి విషెస్  తెలియజేశారు. ఇదిలా ఉండగా... ఈ బర్త్ డే వేడుకులను రోహిత్ శర్మ తన భార్య రితికా, ముంబయి ఇండియన్స్ జట్టుతో కలిసి జరుపుకున్నాడు. గురువారం ముంబయి జట్టు రాజస్థాన్ రాయల్స్ తలపడగా.. విజయం సాధించింది.

 

ఈ మ్యాచ్ విజయం తర్వాత.. ముంబయి టీం.. రోహిత్ బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను రోహిత్ భార్య రితిక ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆమెతోపాటు.. ముంబయి ఇండియన్స్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా వీటిని షేర్ చేయడం విశేషం.

"అతను ఎప్పుడు, ఎక్కడ నడిచినా స్టేజ్ ఫైర్ లో ఉంటుంది. అతని పేరే Ro-HIT Sharma. పుట్టినరోజు శుభాకాంక్షలు, కెప్టెన్. ” అంటూ ముంబయి ఇండియన్స్ ట్విట్టర్ లో క్యాప్షన్ ఇచ్చారు.

ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ కూడా రోహిత్ శర్మకు స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియజేసింది.