Asianet News TeluguAsianet News Telugu

నల్లోడా వ్యాఖ్యలు: ఎట్టకేలకు సామికి ఇషాంత్ శర్మ క్షమాపణలు

ఈ నిరసనలకు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ మొదటి నుంచి తన పూర్తి మద్దతు తెలుపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ వేదికగా సహచరులే తనపై జాతివివక్ష చూపించారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

Had a conversation with Ishant Sharma on racial slur and moved on, says Darren Sammy
Author
Hyderabad, First Published Jul 2, 2020, 7:24 AM IST

టీమిండియా క్రికెటర్ ఇషాంత్ శర్మ.. వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ సామికి క్షమాపణలు తెలిపారు. ఈ విషయాన్ని డారెన్ సామి స్వయంగా వెల్లడించాడు. ఇషాంత్ తనను దురుద్దేశంతో కాలూ(నల్లోడా) అని సంబోధించి ఉండడని పేర్కొన్నారు. ఈ విషయం ఇక్కడితో వదిలేసి ముందుకు వెళ్తామంటూ సామి వెల్లడించారు. క్రికెట్ లో మాత్ర జాతి వివక్షకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు.

కాగా... ఇటీవల ఇటీవల జాతివివక్షపై అమెరికాతోపాటు అనేక దేశాల్లో తీవ్ర ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలకు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ మొదటి నుంచి తన పూర్తి మద్దతు తెలుపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ వేదికగా సహచరులే తనపై జాతివివక్ష చూపించారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

ఇటీవలే ఈ విషయం తనకు తెలిసిందని, అది తెలిసినప్పటినుంచి చాలా కోపంగా ఉందని చెప్పుకొచ్చాడు. "నేను ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ఆడే సమయంలో నన్ను అందరూ ‘కాలూ’ అని పిలిచేవారు. శ్రీలంక ఆటగాడు థిసారా పెరీరాను కూడా అదే పేరుతో పిలిచేవారు. అయితే అప్పట్లో నాకు ఆ పేరుకు అర్థం తెలియదు. ఏదో గొప్ప పేరు అయి ఉంటుందిలే అనుకున్నా. అయితే ఈ మధ్య దాని అర్థం తెలిసింది. అప్పటినుంచి చాలా కోపంగా ఉంది’ అంటూ సామీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కాగా.. ఆ కామెంట్స్ చేసి ఇషాంత్ శర్మ అని తర్వాత తెలిసింది. ఈ నేపథ్యంలో ఇషాంత్.. డారెన్ సామిని క్షమాపణలు కోరినట్లు తెలుస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios