Chennai Super Kings vs Gujarat Titans : ఐపీఎల్ 2024 59వ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో శుభ్ మ‌న్ గిల్, సాయి సుద‌ర్శ‌న్ లు త‌మ బ్యాటింగ్ తో సునామీ సృష్టించాడు. సూప‌ర్ సెంచ‌రీల‌తో విజృంభించారు.  

Chennai Super Kings vs Gujarat Titans : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 17వ సీజ‌న్ (ఐపీఎల్ 2024) లో ప‌రుగుల వ‌ర‌ద పారుతోంది. ఇప్ప‌టికే దుమ్మురేపే రికార్డు ఇన్నింగ్స్ న‌మోదయ్యాయి. ఈ క్ర‌మంలోనే గుజ‌రాత్ టైటాన్స్ బ్యాట‌ర్లు చెన్నై సూప‌ర్ కింగ్స్ బౌలింగ్ ను చెడుగుడు ఆడుకుంటూ ప‌రుగుల సునామీ సృష్టించారు. అహ్మ‌ద‌బాద్ స్టేడియంలో సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించారు. అద్భుత‌మైన సెంచ‌రీల‌తో స‌రికొత్త రికార్డు సృష్టించారు. ఈ సీజ‌న్ లో అత్య‌ధిక ప‌రుగుల భాగ‌స్వామ్యం రికార్డును న‌మోదుచేశారు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ రుగురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో శుభ్ మ‌న్ గిల్, సాయి సుద‌ర్శ‌న్ లు గుజ‌రాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ప‌వ‌ర్ ప్లే లో మంచి స్కోర్ ను సాధించారు. ఇక మిడిల్ ఓవ‌ర్ల‌లో ఫోర్లు, సిక్స‌ర్లు బాదుతూ చెన్నై బౌలింగ్ ను చీల్చి చెండాడారు. ప్ర‌తి ఓవ‌ర్లోనూ బౌండ‌రీలు బాదుతూ గుజ‌రాత్ స్కోర్ ను ప‌రుగులు పెట్టించారు. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రు ప్లేయ‌ర్లు హాఫ్ సెంచ‌రీలు పూర్తి చేసుకున్నారు. 32 బంతుల్లో సాయి సుద‌ర్శ‌న్ హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. ఆ త‌ర్వాత దానిని సెంచ‌రీగా మార్చాడు.

ఈ మ్యాచ్ లో శుభ్ మ‌న్ గిల్ సూప‌ర్ సెంచ‌రీలో చెల‌రేగాడు. చెన్నై బౌలింగ్ పై చిత్త‌చేస్తూ 50 బంతుల్లోనే సెంచ‌రీ సాధించాడు. ఈ సెంచ‌రీ ద్వారా ఐపీఎల్ లో 100వ సెంచరీని సాధించాడు. త‌న సెంచ‌రీ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 6 సిక్స‌ర్లు బాదాడు. సాయి సుద‌ర్శ‌న్ కూడా 50 బంతుల్లో సెంచ‌రీ సాధించాడు. కేవ‌లం 50 బంతుల్లోనే సెంచ‌రీ కొట్టాడు. త‌న సెంచ‌రీ ఇన్నింగ్స్ లో సాయి సుద‌ర్శ‌న్ 5 ఫోర్లు, 7 సిక్స‌ర్లు బాదాడు. ఐపీఎల్ కెరీర్ లో ఇది త‌న‌కు తొలి సెంచ‌రీ కావ‌డం విశేషం. వీరిద్ద‌రి సెంచ‌రీ ఇన్నింగ్స్ ల‌తో17 ఓవ‌ర్ల‌లో గుజ‌రాత్ 209/0 ప‌రుగులు చేసింది. 

Scroll to load tweet…

Scroll to load tweet…

ఐపీఎల్ లో రికార్డుల మోత మోగిస్తున్న ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ