Asianet News TeluguAsianet News Telugu

మ్యాక్స్ వెల్ పుట్టినరోజుకి.. కాబోయే భార్య ఎలా విష్ చేసిందంటే..

తాజాగా మ్యాక్స్ వెల్ పుట్టినరోజు సందర్భంగా విని రామన్ చాలా భిన్నంగా విషెస్ తెలియజేసింది. వారిద్దరూ కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి మరీ శుభాకాంక్షలు తెలియజేసింది.

Glenn Maxwell Gets Adorable Birthday Wish From Indian-Origin Fiancee
Author
Hyderabad, First Published Oct 15, 2020, 10:37 AM IST

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఇటీవల తన 32వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. కాగా.. ఆయనకు కాబోయే భార్య సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. మ్యాక్స్ వెల్ భారత సంతతికి  చెందిన విని రామన్ ను పెళ్లి చేసుకోనున్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో.. వీరి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా వారు షేర్ చేసుకున్నారు.

కాగా.. తాజాగా మ్యాక్స్ వెల్ పుట్టినరోజు సందర్భంగా విని రామన్ చాలా భిన్నంగా విషెస్ తెలియజేసింది. వారిద్దరూ కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి మరీ శుభాకాంక్షలు తెలియజేసింది. కాగా.. దానికి ఆమె పెట్టిన క్యాప్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

‘ హ్యాపీ బర్త్ డే మ్యాక్స్ వెల్.. అకా మై ఫేవరేట్ ఫియాన్సీ అకా మై ఓన్లీ ఫియాన్సీ, అకా బెస్ట్ ఫియాన్సీ ఎవర్’ అంటూ విషెస్ తెలియజేసింది.

 

కాగా.. మ్యాక్స్ వెల్ భారత సంతతి యువతి విని రామన్‌ను పెళ్లాడనున్నాడు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా.. ఇటీవల తాను ప్రేమించిన ప్రేయసికి ఉంగరం తొడిగేసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. దానికి  సంబంధించిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ సందర్భంగా కాబోయే భార్యతో దిగిన ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నాడు. తన  గర్ల్‌ ఫ్రెండ్‌ వినీ ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ చూపిస్తూ ఫొటోకు పోజునివ్వడం విశేషం.మ్యాక్స్‌వెల్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్‌ క్రిస్‌ లిన్‌ శుభాకాంక్షలు తెలిపాడు.

మెల్‌బోర్న్‌లో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్న విని రామన్‌, మ్యాక్స్‌వెల్‌తో కలిసివున్న ఫొటోలు 2017లో సోషల్‌ మీడియాకు ఎక్కడంతో వీరి ప్రేమ వ్యవహారం వెలుగుచూసింది.  గతేడాది ఆస్ట్రేలియా క్రికెట్‌ అవార్డుల ప్రదానోత్సవానికి వీరిద్దరూ కలిసి రావడంతో సీరియస్‌గా ప్రేమించుకుంటున్నారని అర్థమయింది. 

మ్యాక్సీ-విని తరచుగా ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తమ ప్రేమ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. మానసిక సమస్యలు కారణంగా కొంతకాల క్రికెట్‌కు విరామం ఇచ్చాడు. అయితే తాను మానసిక సమస్యలతో బాధ పడుతున్నట్టు మొదట గుర్తించింది విని రామనే అని మ్యాక్స్‌వెల్‌ అప్పట్లో వెల్లడించాడు. 

భారత సంతతి యువతిని పెళ్లాడిన ఆసీస్‌ రెండో క్రికెటర్‌గా అతడు నిలవనున్నాడు. ఆస్ట్రేలియా పేసర్‌ షాన్‌ టైట్‌.. మషూమ్‌ సింఘా అనే యువతిని ప్రేమించిన పెళ్లాడిన విషయం గుర్తుండే ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios