డూ ఆర్ డై మ్యాచ్ లో ఆర్సీబీని ముంచిన మాక్స్‌వెల్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు..
Glenn Maxwell: సాధారణ వన్డే మ్యాచ్ ల్లో వీరవిహారం చేసి.. ఐపీఎల్ లో మాత్రం ఫెల్యూర్ అవుతున్నారు. ఎంతో నమ్మకంతో ఎన్నో ఆశలతో.. కోట్లాది రూపాయాలను వేచించినా అసలు టైంకు పేలవ ప్రదర్శన కనబరుస్తున్నారు. ఆ జాబితాలో ఈ సారి ముందు నిలిచిన వారు ఆస్ట్రేలియా ఆటగాడు, బెంగుళూరు జట్టు కీలక ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్. ఈ సారి ఆ ఆటగాడు మాత్రం చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటి ?
Glenn Maxwell: ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ 1 లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ నాయకత్వం వహిస్తున్న రాజస్థాన్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఆర్‌సీబీని ఓడించి క్వాలిఫయర్-2లోకి ప్రవేశించింది. దీంతో రాజస్థాన్ జట్టు మే 24న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ గోల్డెన్ డక్‌కి గురయ్యాడు. ఈ సీజన్‌లో అతను నాలుగోసారి డక్ అవుట్ ఔట్ అయ్యాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో గెలుపొందిన ప్లేఆప్ లోకి అడుగుపెట్టిన బెంగళూరు ప్రయాణం ముగిసింది. ఈ కీలక మ్యాచ్‌లో జట్టు స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ మరోసారి నిరాశపరిచారు. అదే సమయంలో తన పేరిట ఓ చెత్త రికార్డును నమోదు చేసుకున్నారు.
చెత్త రికార్డు
వరుస వైఫల్యాలతో గెన్ మ్యాక్స్ వెల్ తన పేరిట చెత్త రికార్డు నమోదు చేసుకున్నారు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు గోల్డెన్ డక్‌కి గురైన వ్యక్తిగా దినేష్ కార్తీక్‌తో సమానంగా నిలిచాడు. ఐపీఎల్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌లు 18 సార్లు తొలి బంతికే ఔట్ అయ్యారు. అదే సమయంలో గత రాత్రి ఐపీఎల్‌లో మ్యాక్స్‌వెల్ 18వ సారి గోల్డెన్ డక్‌తో ఔట్ అయ్యాడు. అలాగే.. టీ20 క్రికెట్‌లో 32 సార్లు మాక్స్‌వెల్ తొలి బంతికే అవుట్ కావడం మరో రికార్డు.
ఐపీఎల్‌లో అత్యధిక సార్లు గోల్డెన్ డక్ అవుట్ అయిన బ్యాట్స్‌మెన్
- దినేష్ కార్తీక్ 18
- గ్లెన్ మాక్స్వెల్ 18
- రోహిత్ శర్మ 17
- పీయూష్ చావ్లా 16
- సునీల్ నరైన్ 16
టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు గోల్డెన్ డక్ అవుట్ అయిన బ్యాట్స్‌మెన్
- సునీల్ నరైన్ 44
- అలెక్స్ హెల్మ్స్ 43
- రషీద్ ఖాన్ 42
- గ్లెన్ మాక్స్‌వెల్ 32
- పాల్ స్టెర్లింగ్ 32
ఈ సీజన్‌లో నాలుగు సార్లు
ఐపీఎల్ 17వ సీజన్ లో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు మాక్స్ వెల్ అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచారు. ఈ సీజన్ లో 10 మ్యాచ్‌ల్లో కేవలం 52 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ సీజన్‌లో అతను నాలుగు సార్లు (సున్న పరుగులు) ఫేవిలియన్ చేరారు. రాజస్థాన్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ధృవ్ జురెల్ బౌలింగ్ లో అశ్విన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. ఇప్పటి వరకు అతని ఐపీఎల్ కెరీర్ లో చెత్త ప్రదర్శన ఇదే. IPL 2024లో మాక్స్‌వెల్ 8.0 ఎకానమీ రేటుతో పరుగులు వెచ్చిస్తూ ఆరు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.