యజ్వేంద్ర చాహాల్... సన్నగా కరెంట్ తీగలా కనిపించే ఈ స్పిన్నర్, మహా అల్లరోడు. చాహాల్ టీవీ అంటూ ఫన్నీ ఫన్నీ ప్రశ్నలతో క్రికెటర్లను ఇంటర్వ్యూ చేసే చాహాల్, ఆర్‌సీబీలో కీలక స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడు.

తాజాగా రాజస్థాన్ రాయల్స్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం దక్కించుకున్న ఆర్‌సీబీ, డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన చాహాల్ చేసిన ఫన్నీ ఇంటర్వ్యూను విడుదల చేసింది.

 

‘మీరు చూశారుగా... ఈ మ్యాచ్‌లో నేను రెండు క్యాచులు అందుకున్నా. ఆ రెండూ కూడా చాలా కష్టమైన క్యాచులు. కానీ చూడడానికి ఈజీగా ఉంటాయి. మ్యాక్స్‌వెల్ పట్టింది ఒకే క్యాచ్. అది చాలా ఈజీ కానీ డైవ్ చేయడంతో చాలా కష్టమైన క్యాచ్‌గా కనిపించింది. ఏమయ్యా మ్యాక్స్‌వెల్... ఓ ఫోన్ కోసం డ్రైవ్ చేసి క్యాచ్ పట్టుకోవాలా... చెప్పు’ అంటూ కామెంట్ చేశాడు యజ్వేంద్ర చాహాల్.  

ఆర్‌సీబీ ప్లేయర్ షాబజ్ అహ్మద్ కూడా చాహాల్‌కి సపోర్ట్ చేశాడు. ‘కేవలం ఫోన్ గిఫ్ట్‌గా పొందడానికి మ్యాక్స్‌వెల్ ఇలా చేశాడంటూ’ కామెంట్ చేశాడు. ఈ ఫన్నీ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.