సారాంశం

RCB retained and release list: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 వేలానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) విడుదల చేసిన, రిటైన్ చేయబడిన , ట్రేడ్ చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితాను విడుదల చేసింది.  

 

RCB retained and release list: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 తదుపరి సీజన్ కోసం మినీ వేలం  డిసెంబర్ 19న దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో జరగనుంది. ఈ  నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) షాకింగ్ డిసిషన్ తీసుకుంది. ఏకంగా 11 మంది ఆటగాళ్లను వదిలేసింది. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ప్రధాన బౌలర్లతో పాటు ఆల్‌రౌండర్లకు వీడ్కోలు పలికింది. 
 
ఐపీఎల్ 2022  వేలం లో రూ. 10 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన హర్షల్ పటేల్‌తో పాటు వానిందు హసరంగాలకు గుడ్ బై చెప్పింది ఆర్సీబీ. గతేడాది జరిగిన సీజన్‌లో ఈ ఇద్దరూ ఆటగాళ్లు దారుణంగా ఫెయిల్ అయ్యారు. అలాగే.. వారు ప్రస్తుతం ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కోంటున్నారు. దీంతో వారిని వదులుకుంటేనే మంచిందని భావించింది ఆర్సీబీ. ఎవ్వరూ ఊహించని విధంగా ఆ జట్టు ప్రధాన పేసర్ జోష్ హజెల్ వుడ్‌తో పాటు మైఖేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లేలకు కూడా విడిచిపెట్టింది. 

RCB రిటైన్ చేసిన ఆటగాళ్లు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్వెస్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్ నుండి) , విజయ్‌కుమార్ వైశ్య, ఆకాష్ దీప్. మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్.

RCB విడుదల చేసిన ఆటగాళ్లు: వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, సోనూ యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, కేదార్ జాదవ్. 

భారత్ వెలుపల వేలం నిర్వహించడం ఇదే తొలిసారి. గతేడాది బిసిసిఐ వేలాన్ని ఇస్తాంబుల్‌లో నిర్వహించాలని భావించినా చివరికి కొచ్చిలో నిర్వహించింది. గతేడాదితో పోలిస్తే ఒక్కో జట్టుకు రూ.100 కోట్ల బడ్జెట్‌ను కేటాయించనున్నారు.