Asianet News TeluguAsianet News Telugu

హెల్మెట్ పారేసి.. బ్యాట్ ను కుర్చీకి బాది.. అన్యాయంగా ఔటిచ్చారని అసహనంతో ఊగిపోయిన మాథ్యూ వేడ్

IPL 2022 RCB vs GT: ఆర్సీబీతో వాంఖెడే లో జరుగుతున్న మ్యాచ్ లో  గిల్ ఔటయ్యాక వచ్చాడు వేడ్. 13 బంతులాడి రెండు ఫోర్లు, సిక్స్ తో మంచి టచ్ లో కనిపించాడు. అయితే  అతడు థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి బలయ్యాడు. 

Frustrated Matthew Wade  Throw Helmet and Bat in Dressing Room  After Controversial LBW
Author
India, First Published May 19, 2022, 9:38 PM IST

ఈ ఐపీఎల్ సీజన్ లో గుజారత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న  ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. అతడి  చెత్త ప్రదర్శనలు చూసిన టీమ్ మేనేజ్మెంట్ పలు మ్యాచులకు అతడిని దూరం పెట్టింది. అయితే ప్లేఆఫ్ చేరుకున్నాక తిరిగి జట్టులో అవకాశం కల్పించినా అతడు దానిని సరిగా వినియోగించుకోలేకపోతున్నాడు.తాజాగా   గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో వాంఖెడే లో జరుగుతున్న మ్యాచ్ లో ఔట్ అయ్యాక.. మాథ్యూ వేడ్ ఫ్రస్టేషన్ పీక్స్ కు వెళ్లింది. దాంతో అతడు  డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి.. హెల్మెట్ ను గట్టిగా విసరేస్తూ.. బ్యాట్ ను కుర్చీకి బాదుతూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.  

అసలేం జరిగిందంటే.. ఆర్సీబీతో మ్యాచ్  లో శుభమన్ గిల్ ఔటయ్యాక వచ్చాడు వేడ్. 13 బంతులాడి రెండు ఫోర్లు, సిక్స్ తో మంచి టచ్ లో కనిపించాడు. అయితే  గుజరాత్ ఇన్నింగ్స్ లో ఆరో ఓవర్ వేసిన గ్లెన్ మ్యాక్స్వెల్ బౌలింగ్ లో  రెండో బంతికి అంపైర్ అతడిని ఎల్బీడబ్ల్యూగా ఔటిచ్చాడు. 

అయితే  బంతి తన బ్యాట్ కు తాకిందనే ఉద్దేశంతో వేడ్  రివ్యూకు వెళ్లాడు. టీవీ రిప్లేలో బంతి.. వేడ్ బ్యాట్ నుంచి వెళ్తున్నప్పుడు లైట్ గా టచ్ అవుతూ వెళ్లినట్టు కనిపించింది. డీఆర్ఎస్ లో వచ్చే  లైన్ కూడా కాస్త షేక్ అయింది. ఇదే నమ్మకంతో డీఆర్ఎస్ కు వెళ్లినా.. వేడ్ కు మాత్రం అందుకు విరుద్ధమైన నిర్ణయం వచ్చింది. బంతి.. వేడ్ బ్యాట్ కు ముద్దాడుతూ వెళ్లిన విషయాన్ని లెక్క చేయని థర్డ్ అంపైర్.. అతడిని ఔట్ గా  ప్రకటించాడు. 

 

దీంతో  వేడ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. క్రీజు నుంచి   బౌండరీ లైన్ దాటేవరకు అసహనంతోనే వెళ్లిన అతడు.. ఇక డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిన వెంటనే  హెల్మెట్ నుగట్టిగా విసిరేశాడు. పెవిలియన్ రూమ్  లో తన సహచరులు అందరూ చూస్తుండగానే.. కోపంతో ఊగిపోతూ బ్యాట్ ను అక్కడే ఉన్న కుర్చీ మీద కసి తీరా బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది వివాదాస్పద రీతిలో ఔటైనా వేడ్.. పెవిలియన్ నుంచి  డగౌట్ కు వచ్చినా అక్కడ కూడా నిరాశగానే కనిపించాడు. 

 

కాగా వేడ్.. థర్డ్ అంపైర్ ఔటిచ్చిన తర్వాత  నిరాశగా డగౌట్ కు వెళ్తున్నప్పుడు  విరాట్ కోహ్లి వచ్చి అతడి భుజం మీద చేయి వేసి ఓదార్చాడు.  ఇందుకు సంబంధించిన ఫోటో కూడా ఇప్పుడు  సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios