Asianet News TeluguAsianet News Telugu

Ravi Shastri: స్వాగ్ లుక్ లో రవిశాస్త్రి.. పార్టీ మూడ్ లో రచ్చ.. అర్థం పర్థం లేని ట్వీట్స్..

Ravi Shastri Tweets Went Viral: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి పార్టీ మూడ్ లోకి మారాడు. టీమిండియా క్రికెటర్ గా మాజీ హెడ్ కోచ్ గా నిత్యం  హుషారుగా కనిపించిన శాస్త్రి.. ఈ కొత్త అవతారం చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. 

Former Team India Head Coach Ravi Shastri in a New Avatar, post Went Viral
Author
India, First Published May 21, 2022, 5:12 PM IST

ఎప్పుడూ నీట్ గా టక్ చేసుకుని కోట్ వేసుకుని.. చెవులలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని  ప్రేక్షకులకు తన కామెంట్రీతో అలరించే  టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి పూర్తిగా లుక్ మార్చేశాడు. ఆయన పార్టీ మూడ్ లోకి మారాడు.  ఫ్లెష్ జాకెట్, కూలింగ్ గ్లాసెస్, మెడలో పొడగాటి  వెండి  చైన్ తో స్వాగ్ లుక్ లో దుమ్ముదులిపాడు. పార్టీలో యువకులు, అమ్మాయిలతో  కలిసి  రచ్చ రచ్చ చేశాడు. హుందాగా కనిపించే శాస్త్రి ఇన్ని వేరియషన్స్ చూపించి.. పార్టీలో రచ్చ రచ్చ చేయడమే గాక తర్వాత ఆయన ట్విటర్ వేదికగా పెట్టిన  పోస్టులు.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ట్విటర్ వేదికగా శాస్త్రి ఓ వీడియోను షేర్ చేశాడు.అది క్రెడ్ యాప్ కు సంబంధించిన ప్రమోషనల్ యాడ్ వీడియో. గతంలో ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్  రాహుల్ ద్రావిడ్ ను ‘ఇందిరానగర్ కా గూండా’ అని చూపిన క్రెడ్.. ఇప్పుడు రవిశాస్త్రిని పార్టీ బాయ్ గా మార్చేసింది.  

ఈ వీడియోలో శాస్త్రి.. ప్రముఖ బాలీవుడ్ చిత్రం షారుక్ ఖాన్ హీరోగా నటించిన ‘చక్ దే ఇండియా’లోని ఫేమస్ డైలాగ్ ను చెప్పడంతో  యాడ్ ప్రారంభమవుతుంది. తన ముందు ఉన్న ఆటగాళ్లకు శాస్త్రి..‘మీ ముందు 70 నిమిషాలున్నాయి.  ఆ తర్వాత హ్యాపీ అవర్స్ అయిపోతాయి. లెట్స్ పార్టీ...’ అని అంటాడు. ఇక పార్టీలో ఉన్న ఓ అమ్మాయితో ‘నేను బ్యాటర్ గా ఉండేవాన్ని. కానీ నీ కోసం నేను వికెట్ కీపర్ గా మారతా..’ అని ఝలక్ ఇచ్చాడు. ఓ జర్నలిస్టు ‘సార్.. ఈ ఆధునిక  క్రికెట్ కాలంలో మీరు బాగా విసుక్కునేది ఏంటి సార్..?’ అని అడగ్గా దానికి శాస్త్రి.. ‘జర్నలిస్టులతో మాట్లాడటం..’ అని పంచ్ ఇచ్చాడు. 

 

ఇదే యాడ్ లో ఆటగాళ్లంతా షాంపైన్ బాటిల్ ను ఓపెన్ చేసి ఎంజాయ్ చేస్తుంటే.. ‘వేస్ట్ చేయకండ్రా బాబు..’ అని మందలించాడు.చివర్లో ఓ మందుల దుకాణం దగ్గరకు వెళ్లి.. ‘ఓ రెండు దగ్గు సిరఫ్ లు ఇవ్వు..’ అని చెప్పాడు. శాస్త్రితో పార్టీ మూడ్ లో వినూత్నంగా  యాడ్ చేయించిన క్రెడ్.. అడ్వర్టైజ్మెంట్ ల రూపకల్పనలో తనెంత డిఫరెంట్ గా ఉంటుందో చెప్పకనే చెప్పింది. 

 

ఇక ఈ యాడ్ ను విడుదల చేయకముందు.. శాస్త్రి తన ట్విటర్ లో  ఈ పార్టీకి  సంబంధించిన పలు ఫోటోలను షేర్ చేస్తూ.. చిత్ర విచిత్రమైన ట్వీట్లు చేయడంతో అతడి అకౌంట్ హ్యాక్ అయిందేమోనని అంతా భావించారు. ‘నేను చిల్ అవ్వాలంటే ఏం చెయ్యాలి..?’ ‘ నా కుటుంబం ముంబైలో జీవిస్తున్నది. నేను ఇక్కడ ఉన్నా..’ అని చేసిన ట్వీట్స్  క్రికెట్ అభిమానులకు గందరగోళానికి గురి చేశాయి.  కానీ ఆ తర్వాత ఈ యాడ్ ను విడుదల చేయడంతో  అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios