దిశ హత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంతో తెలంగాణ పోలీసులపై దేశ ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు.

భవిష్యత్‌లో మరొకరు ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా ఉండాలంటే ఇదే సరైన నిర్ణయమని భజ్జీ అభిప్రాయపడ్డాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ పోలీసుల్ని హర్భజన్ అభినందించాడు. మీరు ఏదైతే చేశారో అది ఖచ్చితంగా అభినందనీయమైనదని అన్నాడు. 

Also Read:ప్రత్యూష, అయేషా మీరా కేసుల్లో ఏమైంది: దిశ కేసు ప్రత్యేకమా...

మిగిలిన రాష్ట్రాల పోలీసులు హైదరాబాద్ పోలీసులను స్ఫూర్తిగా తీసుకోవాలంటూ పలువురు సూచనలు చేస్తున్నారు. అందరూ ప్రశంసలకు మాత్రమే పరిమితమైతే.. ఓ వ్యక్తి మాత్రం పోలీసులకు రివార్డు కూడా ప్రకటించారు.

వివరాల్లోకి వెళితే... హర్యానాకు చెందిన రాహ్ గ్రూప్ ఫౌండేషన్ ఛైర్మన్ నరేశ్ సెల్పార్ దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినట్లు తెలుసుకుని హర్షం వ్యక్తం చేశవారు. తెలంగాణ పోలీసుల చర్యను అభినందించిన ఆయన... ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులకు రివార్డు ప్రకటించారు.

Also read:దిశ రేప్, హత్య కేసు: అర్థరాత్రి నలుగురు నిందితుల కాల్చివేత

ఒక్కొక్క పోలీసు అధికారికి రూ.లక్ష చొప్పున రివార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. నరేశ్ ప్రకటనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. దిశపై అత్యాచారం , హత్యకు పాల్పడిన నిందితులను శుక్రవారం తెల్లవారుజామున తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.