Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్ సోకి... పాక్ మాజీ క్రికెటర్ మృతి

కొద్దిరోజుల క్రితం కరోనా వైరస్ సోకిన పాకిస్థాన్ మాజీ ఫస్ట్‌-క్లాస్ క్రికెటర్ రియాజ్ షేక్(51) మృతి చెందారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

Former Pakistani cricketer Riaz Sheikh dies of coronavirus at 51
Author
Hyderabad, First Published Jun 3, 2020, 7:19 AM IST

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ ఈ వైరస్ వికృత రూపం దాలుస్తోంది. సామాన్యులు, సెలబ్రెటీలు అనే తేడా లేకుండా అందరినీ వైరస్ చుట్టుముట్టేస్తోంది. కాగా.. తాజాగా ఈ వైరస్ సోకి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు.  పూర్తి వివరాల్లోకి వెళితే...

కొద్దిరోజుల క్రితం కరోనా వైరస్ సోకిన పాకిస్థాన్ మాజీ ఫస్ట్‌-క్లాస్ క్రికెటర్ రియాజ్ షేక్(51) మృతి చెందారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. షేక్ మృతికి సంతాపం తెలియజేసిన లతీఫ్.. తన ఆత్మ శాంతి కలగాలని అందరూ ప్రార్ధించాలని కోరారు. 

1987 నుంచి 2005 వరకూ తన కెరీర్‌లో షేక్.. 43 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 25 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడారు. రిటైర్‌మెంట్ తర్వాత ఆయన మొయిన్ ఖాన్ క్రికెట్ ఆకాడమీలో ప్రధాన కోచ్‌గా చేరారు. షేక్ కంటే ముందు మరో పాకిస్థాన్ ఫస్ట్‌-క్లాస్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్‌ కూడా కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలలో ఆయన మృతి చెందారు. వరసగా ఇద్దరు సీనియర్ క్రికెటర్లను పాక్ కోల్పోయింది. దీంతో.. అక్కడి క్రికెటర్లు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థించారు.

Follow Us:
Download App:
  • android
  • ios