Asianet News TeluguAsianet News Telugu

కులం పేరుతో దూషణలు.. రోహిత్‌తో కలిసి నవ్వులు, టీమిండియా మాజీ క్రికెటర్​ యువరాజ్​​ అరెస్ట్

టీమిండియా (team india) మాజీ డాషీంగ్ ఓపెనర్, ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ (yuvraj singh) ఆదివారం అరెస్టు అయ్యారు. కుల వివ‌క్షతో కూడిన వ్యాఖ్య‌లు చేసినందుకు ఈయ‌న‌ను హ‌ర్యానా పోలీసులు (haryana police) అరెస్టు చేసి.. ఆపై బెయిల్‌పై విడిచిపెట్టిన‌ట్లు స‌మాచారం. 

former indian allrounder yuvraj singh arrested for casteist comments
Author
Hisar, First Published Oct 17, 2021, 10:58 PM IST

టీమిండియా (team india) మాజీ డాషీంగ్ ఓపెనర్, ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ (yuvraj singh) ఆదివారం అరెస్టు అయ్యారు. కుల వివ‌క్షతో కూడిన వ్యాఖ్య‌లు చేసినందుకు ఈయ‌న‌ను హ‌ర్యానా పోలీసులు (haryana police) అరెస్టు చేసి.. ఆపై బెయిల్‌పై విడిచిపెట్టిన‌ట్లు స‌మాచారం. 

వివరాల్లోకి వెళితే.. 2020 జూన్ లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శ‌ర్మ‌తో (rohit sharma) క‌లిసి యువ‌రాజ్ సింగ్ ఇన్‌స్ట్రాగ్రామ్ లైవ్‌లో (insta live) మాట్లాడాడు. ఆ సంద‌ర్భంగా యుజేంద్ర చాహ‌ల్‌పై (yuzvendra chahal) యూవీ స‌ర‌దాగా కామెంట్లు చేశాడు. చాహ‌ల్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వీడియోలు చేస్తున్నాడ‌ని.. బాంగీ మ‌నుషుల్లా (bungy cast) వీళ్ల‌కు ప‌ని పాటా లేదా అంటూ వ్యాఖ్యానించాడు. దీనికి రోహిత్ శ‌ర్మ, యూవీ ఇద్ద‌రూ పకపకా న‌వ్వుకున్నారు. ఆ వీడియో అప్ప‌ట్లో తెగ వైర‌ల్ అయింది.

ALso Read:ఆ రోజు ఏం జరిగిందో కళ్లకు కట్టినట్టు చూపించిన యువరాజ్ సింగ్... బాలీవుడ్‌లోకి వెళ్తానంటూ...

అయితే ద‌ళితుల‌ను (dalits) అవ‌మానించేలా యువ‌రాజ్ కామెంట్స్ ఉన్నాయ‌ని నెటిజ‌న్లు దుమ్మెత్తిపోశారు. ఆ మాటలకు యువ‌రాజ్ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్లు కూడా వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే హ‌ర్యానాలోని హిస్సార్ పోలీస్ స్టేష‌న్‌లో (hisar police station) యువ‌రాజ్ సింగ్‌పై కేసు న‌మోదైంది. ద‌ళిత హ‌క్కుల నేత ర‌జ‌త్ క‌ల్స‌న్ ఫిర్యాదు మేర‌కు ఈ కేసు న‌మోదైంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న.. రోహిత్ శ‌ర్మ‌ను కూడా త‌ప్పుబ‌ట్టాడు. 

దీనిపై అప్పట్లోనే ఎస్పీ (SP) లో కేంద్ర సింగ్ మాట్లాడుతూ.. విచారణకు సంబంధించిన వివరాలను ఇప్పటికే డీజీపీ (DGP)కి అందించాం. యువరాజ్ తప్పు చేసినట్ల నిర్ధారsణ జరిగితే.. అతనిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం’ అని  చెప్పారు. దీంతో ఇపుడు ఈ కేసులోనే యువరాజ్​ సింగ్​ను పోలీసులు అరెస్ట్ (police arrested)​ చేశారు. దీంతో యువరాజ్​ సింగ్​ తరఫు లాయర్​ బెయిల్​ అప్లై చేయడం.. బెయిల్​ రావడం చకచకా జరిగిపోయాయి. అయితే కాగా, ఈ ఘటనపై గతేడాది జూన్​లోనే యువరాజ్​ సింగ్​ క్షమాపణలు చెప్పాడు.

Follow Us:
Download App:
  • android
  • ios