కరోనా మహమ్మారి కారణంగా మరో క్రికెటర్ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. కరోనా వైరస్ కారణంగా యంగ్ క్రికెటర్ చేతన్ సకారియా తండ్రితో పాటు సీనియర్ స్పిన్నర్ పియూష్ చావ్లా తండ్రిని కోల్పోయిన విషయం తెలిసిందే.

తాజాగా భారత మాజీ పేసర్ ఆర్‌పీ సింగ్ తండ్రి శివ్ ప్రసాద్ సింగ్, కరోనా వైరస్‌తో పోరాడుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. తండ్రి కోవిద్‌-19తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయినట్టు ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు రుద్రప్రతాప్ సింగ్.

కొంతకాలం క్రితం భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి కూడా కరోనా కారణంగా తల్లినీ, అక్కనీ కోల్పోయింది. 2007 టీ20 వరల్డ్‌కప్‌గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న ఆర్పీసింగ్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఆప్తమిత్రుడు.