Asianet News TeluguAsianet News Telugu

INDvsENG: కుప్పకూలిన ఇంగ్లాండ్.. టీమిండియా సూపర్ పర్ఫార్మెన్స్.. చెలరేగిన బౌలర్లు, జైస్వాల్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ టీమ్ తొలి రోజే కుప్పకూలిపోయింది. 246 పరుగులు సాధించిన ఇంగ్లాండ్ టీమ్ ఆలౌట్ కాగా.. టీమిండియా బ్యాటింగ్ చేపట్టి తొలి రోజే అందులో దాదాపు సగం పరుగులు చేసింది. యశస్వీ హాఫ్ సెంచరీ కూడా కొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌లో స్టోక్స్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు.
 

first test first day match ends in hyderabad of india vs england, englad allout for 246, india scores 119 runs kms
Author
First Published Jan 25, 2024, 5:25 PM IST | Last Updated Jan 25, 2024, 5:25 PM IST

INDIA vs ENGLAND: ఇండియా, ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య ఫస్ట్ టెస్ట్, ఫస్ట్ డే ఆట ముగిసింది. భారత పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ టీమ్‌కు టీమిండియా ముచ్చెమటలు పట్టించింది. తొలి రోజే ఇంగ్లాండ్‌ టీమ్‌కు దడ పుట్టించింది. ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ చూపించింది. బౌలర్లు, బ్యాటర్లు రాణించారు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. ఆశించిన విధంగా రాణించలేకపోయింది. ఇంగ్లాండ్ టీమ్ మొత్తం 64.3 ఓవర్లలో ఆలౌట్ అయింది. 246 పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్‌మెన్ కూడా క్రీజులోకి దిగగానే రెచ్చిపోయారు. 23 ఓవర్లలో 119 పరుగులు సాధించారు. రోహిత్ శర్మ స్వల్ప స్కోరుకు పెవిలియన్‌ దారి పట్టగా.. యశస్వీ జైస్వాల్ మాత్రం తన తడాఖా చూపించాడు. 70 బంతుల్లో 76 పరుగులు సాధించాడు.

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (ఉప్పల్)స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఇంగ్లాండ్ టీమ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు దారుణంగా తడబడ్డారు. ఒక్క స్టోక్స్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్లు ఎవరూ 40 పరుగులు కూడా సాధించకుండానే వెనుదిరిగారు. స్టోక్స్ 70 పరుగులు చేశాడు. చివరి దాకా స్టోక్స్ క్రీజులోనే ఉన్నాడు. బుమ్రా ఆయనను 64.3 బంతికి అవుట్ చేశాడు.

Also Read: IND vs ENG 1st Test: ఉప్పల్ స్టేడియంలో రోహిత్ శర్మ పాదాలను తాకిన అభిమాని, వీడియో వైరల్

భారత స్పిన్నర్లు రాణించారు. కీలక వికెట్లను తీశారు. మొత్తంగా బుమ్రా రెండు వికెట్లు, రవీంద్ర జేడాజ మూడు వికెట్లు, అశ్విన్ మూడు వికెట్లు, అక్సర్ రెండు వికెట్లు తీశారు.

ఇక టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ కూడా తొలి రోజే ప్రారంభించింది. ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేసి దాదాపు సగం స్కోర్ కూడా చేసింది. ఓపెనర్లుగా దిగిన యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మలు గుడ్ స్టార్ట్ ఇచ్చారు. అయితే, రోహిత్ శర్మ 12వ ఓవర్లోనే వెనుదిరగ్గా.. శుభ్‌మన్ గిల్ క్రీజులోకి వచ్చారు. యశస్వీ జైస్వాల్ 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు సాధించాడు. ఫస్ట్ డే ప్రత్యర్థి టీమ్‌ను ఆలౌట్ చేసి అత్యధిక పరుగులు సాధించిన రెండో ఇండియన్ బ్యాట్స్‌మెన్‌గా యశస్వీ నిలిచారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios