Asianet News TeluguAsianet News Telugu

పెళ్లైన రెండేళ్లకు అత్తామామలను కలిసిన హార్ధిక్ పాండ్యా... నా కుటుంబం అయ్యారంటూ...

నటాశా స్టాంకోవిక్ కుటుంబాన్ని మొదటిసారి కలిసిన హార్ధిక్ పాండ్యా...  వీడియో షేర్ చేసి, ‘ఇలాంటి క్షణాలు మళ్లీ రావంటూ...’ 

finally after 2 years of marriage hardik pandya meets natasha's family
Author
First Published Sep 26, 2022, 3:40 PM IST

టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా చాలా అడ్వాన్స్‌ పర్సన్. నటాశాతో ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత కొన్నిరోజులకే ఆమె గర్భవతి అంటూ ప్రకటించాడు పాండ్యా. కొడుకు కూడా పుట్టేశాడు కానీ వీరిద్దరికీ పెళ్లి అయ్యిందా? అయితే ఎప్పుడైంది? అనే విషయాలపై క్లారిటీ కూడా లేదు. తాజాగా కొడుకు పుట్టిన ఏడాదిన్నరకి అత్తామామలను కలిశాడు హార్ధిక్ పాండ్యా...

సెర్బియాకి చెందిన  మోడల్, బాలీవుడ్ నటి నటాశా స్టాంకోవిక్‌‌తో 2020, జనవరి 1న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా. అదే ఏడాది జూలై 30లో వీరికి అబ్బాయి జన్మించాడు. అయితే ఎంగేజ‌్‌మెంట్ అయిన ఏడు నెలలకే తల్లిదండ్రులుగా మారారు నటాశా, హార్ధిక్ పాండ్యా...

వీరి పెళ్లి ఎప్పుడయ్యింది? పెళ్లి చేసుకున్నారా? లేక ఎంగేజ్‌‌లో డేటింగ్‌లోనే కొనసాగుతున్నారా? అనే విషయాలు ఇప్పటిదాకా ప్రకటించలేదు నటాశా, హార్దిక్ పాండ్యా... ఎట్టకేలకు నటాశా తల్లిదండ్రులను కలుసుకున్నాడు హార్ధిక్ పాండ్యా...

సెర్భియాకి చెందిన నటాశా తండ్రి గోరన్ స్టాంకోవిక్, తల్లి రాద్మిలా స్టాంకోవిక్‌లను సోమవారం హైదరాబాద్‌లో కలుసుకున్నాడు హార్ధిక్ పాండ్యా. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు హార్ధిక్ పాండ్యా... 

‘వీడియో కాల్స్, ఫోన్స్ కాల్స్ తర్వాత ఎట్టకేలకు మనుషులను కలిశా. నటాశా కుటుంబాన్ని (ఇప్పుడు నా కుటుంబం) మొట్టమొదటిసారి చాలా అద్భుతంగా అనిపించింది. ఇలాంటి గొప్ప గొప్ప మూమెంట్స్ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి...’ అంటూ రాసుకొచ్చాడు హార్ధిక్ పాండ్యా...

మొహాలీలో జరిగిన తొలి టీ20లో 30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 71 పరుగులు చేసి టీమిండియాకి 208 పరుగుల భారీ స్కోరు అందించాడు హార్ధిక్ పాండ్యా. బౌలింగ్‌లో 2 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చిన హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్ క్యాచ్ డ్రాప్ చేయడంతో వికెట్ మిస్ చేసుకున్నాడు...

వర్షం కారణంగా 8 ఓవర్ల పాటు సాగిన నాగ్‌పూర్ టీ20లో ఇన్నింగ్స్ మొదటి ఓవర్ బౌలింగ్ చేసిన హార్ధిక్ పాండ్యా 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. బ్యాటింగ్‌లో 9 పరుగులు చేసి అవుటైన హార్ధిక్ పాండ్యా, హైదరాబాద్‌లో జరిగిన మూడో టీ20లో 3 ఓవర్లు బౌలింగ్ చేసి వికెట్ తీయలేకపోయినా జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ భారీగా పరుగులు ఇచ్చిన చోట 23 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 

సూర్యకుమార్ యాదవ్ అవుటైన తర్వాత ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన హార్ధిక్ పాండ్యా 16 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్‌లో విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత బౌండరీ బాది, మ్యాచ్‌ని ముగించాడు హార్ధిక్ పాండ్యా...

Follow Us:
Download App:
  • android
  • ios