ఆసియా కప్ ఫైనల్ లో అదరగొట్టిన సిరాజ్.. రియాక్షన్ ఇదే..!
సిరాజ్ కారణంగానే ఈ మ్యాచ్ లో శ్రీలంక అతి దారుణంగా ఓడిపోయింది. ఇక, భారత్ కి మ్యాచ్ గెలవడం అతి సునాయాసంగా మారింది.
ఆసియా కప్ లో ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది. కోలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. భారత్, శ్రీలంక మధ్య జరిగిన ఈ మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. కాగా, ఈ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ విధ్వం సం సృష్టించాడు. సిరాజ్ కారణంగానే ఈ మ్యాచ్ లో శ్రీలంక అతి దారుణంగా ఓడిపోయింది. ఇక, భారత్ కి మ్యాచ్ గెలవడం అతి సునాయాసంగా మారింది.
సిరాజ్ 7-1-21-6తో ఆటను ముగించాడు, భారత్ మొదటగా ఫీల్డింగ్‌లోకి దిగిన తర్వాత శ్రీలంకను 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌట్ చేసింది. వన్డే చరిత్రలో లసిత్ మలింగ, చమిందా వాస్ తర్వాత ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. మొత్తం 6 వికెట్లను ఒక్కడే తీయడం విశేషం.
కాగా, ఈ మ్యాచ్ లో సిరాజ్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది. తాజాగా, దీనిపై సిరాజ్ స్పందించాడు.“ఒక కలలా అనిపిస్తుంది. చివరిసారి తిరువనంతపురంలో శ్రీలంకపై ఆడినప్పుడు అదే చేశాను. ప్రారంభంలోనే నాలుగు వికెట్లు తీశాను, ఐదు వికెట్లు సాధించలేకపోయాను కానీ, ఈ ఱోజు నేను పెద్దగా కష్టపడలేదు. ఈ మ్యాచ్ లో మొత్తంగా ఆరు వికెట్లు తీశాను. ఈ టోర్నీలో గత మ్యాచ్ ల్లోగా పెద్దగా స్వింగ్ దొరకలేదు. కానీ, ఈ మ్యాచ్ మాబత్రం బంతి అద్భుతంగా స్వింగ్ అయ్యింది. ” అని సిరాజ్ చెప్పడం విశేషం.
ఇక, ఈ మ్యాచ్ లో సిరాజ్ కేవలం 7 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అతడు ఆరు వికెట్లు పడగొట్టాడు. అయితే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న సమయంలో మిగతా మూడు ఓవర్లు వేయనివ్వకుండా సిరాజ్ ను పక్కనపెట్టారు. పూర్తి కోటా బౌలింగ్ చేసివుంటే అతడికి మరిన్ని వికెట్లు దక్కేవని క్రికెట్ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. కానీ సిరాజ్ తో పూర్తి కోటా బౌలింగ్ చేయించకుండా టీమిండియా ట్రయినర్ అడ్డుకున్నారని రోహిత్ వెల్లడించారు. ఏది ఏమైనా ఇప్పుడు ఎక్కడ చూసినా సిరాజ్ పేరు మార్మోగిపోతోంది.