కొందరు క్రికెటర్లు క్రికెట్ నుంచి రిటైరైనా తమకు ఎంతో ఇష్టమైన క్రికెట్ పట్ల మక్కువ చూపిస్తూనే ఉంటారు. జూనియర్ ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇవ్వడమో లేదంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమో చూస్తుంటాం.

కొందరు క్రికెటర్లు తమ తరంలోనూ.. ప్రస్తుత తరంలోని ప్రతిభా వంతులైన ఆటగాళ్లతో డ్రీమ్ టీమ్ ప్రకటిస్తూ ఉంటారు. దీనిపై కొందరు పెదవి విరవడం కూడా అంతే కామన్. తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ తన డ్రీమ్ టీ20 జట్టును ప్రకటించి వివాదంలో ఇరుక్కున్నారు.

అసలు టీ20 క్రికెట్ ఆడని క్రికెటర్లను.. వారి ఆటతీరు ఆధారంగా డీన్ జోన్స్ ఎంపిక చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్‌, గోర్డన్ గ్రీనిడ్జ్‌, వివ్ రిచర్డ్స్, బ్రియాన్ లారా, మార్టిన్‌ క్రోలు టీ20లు ఆడలేదు. ఇక భారత్ నుంచి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ధోనికి ఛాన్సిచ్చిన జోన్స్.. విరాట్ కోహ్లీని పక్కనబెట్టేశాడు. 

జోన్స్ డ్రీమ్ టీ20 ఎలెవన్:

మాథ్యూ హేడెన్
గ్రీనిడ్జ్
వివ్ రిచర్డ్స్ 
బ్రియాన్ లారా
మార్టిన్ క్రో
ఇయాన్ బోథమ్
ఎంఎస్ ధోనీ
షేన్ వార్న్
వసీం అక్రమ్
అంబ్రోస్
జోయల్ గార్నర్