IND vs AUS 2024: బాక్సింగ్ డే టెస్ట్ రెండో రోజు మెల్‌బోర్న్ మైదానంలోకి విరాట్ కోహ్లీ అభిమాని ఒకరు సెక్యూరిటీని దాటేసి దూసుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారాయి.
IND vs AUS: క్రికెట్ మైదానంలో ఆటగాళ్లకు, అభిమానులకు మధ్య ఎంతో అనుబంధం ఉంటుంది. అభిమానులు తమ అభిమాన ఆటగాళ్లను కలవడానికి సెక్యూరిటీని కూడా దాటుకుని గ్రౌండ్ లోకి వెళ్లిపోతుంటారు. ఇలాంటివి మ్యాచ్‌ల సమయంలో చాలాసార్లు కనిపించాయి. ఇలాంటిదే ఇప్పుడు భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు చోటుచేసుకుంది. ఒక అభిమాని అకస్మాత్తుగా మైదానంలోకి దూసుకొచ్చి విరాట్ కోహ్లీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. కోహ్లీ ఆ యువ అభిమానిపై కోపం చూపించకుండా నవ్వుతూ అతనితో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియాలు మెల్ బోర్న్ లో నాల్గో టెస్టు ఆగుతున్నాయి. ఈ బాక్సింగ్ డే టెస్ట్ రెండో రోజు భారత బౌలర్లు కంగారూ బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేయడానికి చాలా కష్టపడ్డారు. ఆస్ట్రేలియా తరపున స్టీవ్ స్మిత్ 140 పరుగుల ఇన్నింగ్స్ తో భారత్‌పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. అయితే, మ్యాచ్ ప్రారంభం అయిన మొదటి గంటలోనే ఒక అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. ఆ యువ అభిమాని పరిగెత్తుకుంటూ విరాట్ కోహ్లీ దగ్గరికి వచ్చి ఆయన భుజంపై చేయి వేసి మాట్లాడటం మొదలుపెట్టాడు. కోహ్లీ కూడా నవ్వుతూ అభిమానితో మాట్లాడారు. వెంటనే అక్కడికి వచ్చిన సెక్యూరిటీ గార్డులు ఆ అభిమానిని బయటకు తీసుకెళ్లారు. విరాట్‌పై ప్రేమ చూపించిన ఈ యువ అభిమాని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకు ముందు కూడా ఇలాంటివి చూశాం
విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ స్టార్ ప్లేయర్ ను క్రికెట్ మైదానంలో అభిమానులు ఎప్పుడూ చూడాలనుకుంటారు. ఇలా అభిమానులు కోహ్లీ కోసం మైదానంలోకి రావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఐపీఎల్ సమయంలో ఇలాంటివి చూశాం. పెద్ద పెద్ద ఆటగాళ్లను కలవడానికి అభిమానులు చాలా ఉత్సాహంగా ఉంటారు. కొన్నిసార్లు అభిమానులపై చర్యలు కూడా తీసుకున్నారు. ఆటగాళ్లు కూడా తమ అభిమానులను నిరాశపరచరు, వారికి మద్దతుగా నిలుస్తారు.
హాట్ టాపిక్ గా విరాట్ కోహ్లీ
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2024 బాక్సింగ్ డే టెస్టులో కోహ్లీ హాట్ టాపిక్ గా మారాడు. బాక్సింగ్ డే టెస్ట్ మొదటి రోజు కోహ్లీ వార్తల్లో నిలిచాడు. ఆస్ట్రేలియా 19 ఏళ్ల ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్‌ను భుజంతో ఢీ కొట్టాడు. దాని తర్వాత ఇద్దరు ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే, తర్వాత కోహ్లీ తన తప్పు తెలుసుకుని, తాను తప్పు చేశానని అంగీకరించాడు. కోహ్లీపై మ్యాచ్ రిఫరీ 20% మ్యాచ్ ఫీజు జరిమానా విధించారు. అలాగే, ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చారు.
