టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇంతకాలం తనకు మద్ధతు తెలిపిన అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపాడు.

2004 డిసెంబర్ 23న వన్డేల్లో అరంగేట్రం చేసిన ధోనీ.. కెప్టెన్‌గా భారత్‌కు వన్డే, టీ 20 ప్రపంచకప్‌లు అందించాడు. గతంలోనే టెస్టుల నుంచి తప్పుకున్న మహీ.. వన్డే, టీ20లలో కొనసాగుతున్నాడు.

బ్యాట్‌తో ఎంత బలంగా బాదొచ్చో ప్రపంచ క్రికెట్‌కు రుచి చూపించాడు ఈ జార్ఖండ్ డైనమైట్. 350 వన్డేల్లో ధోనీ 10,773 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 73 అర్ధసెంచరీలున్నాయి.

టెస్టు కెరీర్‌లో 6 సెంచరీలుు, 33 హాఫ్ సెంచరీలు బాదాడు. ఇండియన్ క్రికెట్‌‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా కిర్తీ గడించాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో సిక్స్‌తో ఫినిషింగ్ షాట్ కొట్టి ఆయన అభిమానులను అలరించాడు.

98 టీ 20లు, 90 టెస్టులు ఆడాడు. వన్డేల్లో ధోనీ అత్యధిక స్కోరు 183 పరుగులు. 2007లో రాజీవ్ ఖేల్‌రత్న, 2009లో పద్మశ్రీ, 2018లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నాడు. 2008, 2009లలో ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు.