టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్. ఓ ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడిన ఆయన కెరీర్‌ ఆరంభం నుంచి ఐపీఎల్ వరకు విషయాలను పంచుకున్నాడు.

2016లో పుణేకు ఆడకముందు తానెప్పుడూ ధోనిని నేరుగా చూడలేదని, టీవీలోనే చూశానని తాహిర్ చెప్పాడు. అప్పుడే ఓ హోటల్ గది బయట నిల్చున్నప్పుడు ధోనీ స్వయంగా తన వద్దకు వచ్చి మాట్లాడానని ఆయన తెలిపాడు.

ఎప్పుడైనా తన గదికి రావొచ్చునని ధోనీ ఆహ్వానించాడు. ఆయన మాటలతో తనకు ఆశ్చర్యం వేసిందని.. అలాంటి క్రికెట్ దిగ్గజం అంత నిరాడంబరంగా ఉండటం చాలా నచ్చిందని తాహిర్ తెలిపాడు.

అలా ఆహ్వానించడంతో తరచూ అతని గదికి వెళ్లేవాడినని.. అలా ధోనీ నుంచి క్రికెట్ గురించి అనేక విషయాలు నేర్చుకున్నానని ఆయన చెప్పాడు. అలాగే ధోనికి మామిడి పండ్లంటే చాలా కష్టమని.. వాటిని అందరి ఆటగాళ్లకు పంచిపెడతాడు.

అతని కెప్టెన్సీ ఆడటం ఎంతో బాగుంటుందని.. వీలైతే ఇంకో రెండు, మూడేళ్లు అతనితో కలిసి ఆడతానని తాహిర్ వెల్లడించాడు. అనంతరం ధోనీ చిన్న పిల్లలతో సరదాగా ఉండటంపై స్పందిస్తూ... షేన్ వాట్సన్ కుమారుడితో తన కుమారుడు పోటీపడినప్పుడు మహీ వచ్చి సరదాగా ఆడుకున్నానని చెప్పాడు.

ఐపీఎల్‌‌లో ఇతర జట్లతో పోలిస్తే సీఎస్కే చాలా ప్రత్యేకమని, తమది ప్రొఫెషనల్ జట్టని, యాజమాన్యం ఆటగాళ్లకు పూర్తి స్వేచ్చనిస్తుందని తాహిర్ పేర్కొన్నాడు. తమ జట్టులో అందరూ కష్టపడి ఆడతారని, మ్యాచ్‌లు గెలిసతే సంబరాలు చేసుకుంటామన్నాడు.

తాము ఒత్తిడికి గురవకుండా ఆడతామని, ప్రపంచంలోనే అత్యుత్తమ సారథి తమకున్నాడని స్పష్టం చేశాడు. చెన్నై జట్టంతా ఒకు కుటుంబంలా ఉంటుందని, అలాంటి వాతావరణం ఎక్కడా ఉండదని తాహిర్ గుర్తుచేసుకున్నాడు.