తిరువనంతపురం: కేరళ రాష్ట్రానికి చెందిన రంజీ ట్రోఫీ మాజీ క్రికెటర్ ఎం. సురేష్ కుమార్ (47) తన ఇంట్లో శవమై కనిపించాడు. శుక్రవారం రాత్రి స్వగృహంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు తన తండ్రి సురేష్ కుమార్ పడకగదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆయన మరణించినట్లు ఆయన కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సురేష్ కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అల్లప్పుజా నగరానికి చెందిన సురేష్ కుమార్ 1991 నుంచి 2006 వరకు 72 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడాడు. 1657 పరుగులు చేయడంతో పాటు 196 వికెట్లు పడగొట్టాడు. 

రైల్వే శాఖలో పనిచేస్తున్న సురేష్ కుమార్ కేరళలో 52 క్రికెట్ మ్యాచులు ఆడాడు. దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ కు ప్రాతినిధ్యం వహించారు. 1992 టెస్టు, వన్డే జట్టు తరఫున ఆడాడు. సురేష్ కుమార్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.