భారత్ ని కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తోంది. రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నాయి.. అదే సంఖ్యలో మరణాలు కూడా నమోదౌతున్నాయి. దీంతో... భారత్ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు భారత్ కి మద్దతు పలుకుతున్నాయి. ప్రముఖులు భారత్ కరోనా నుంచి కోలుకోవడానికి తమ వంతు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. 

తాజాగా.. ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ కూడా ఈ విషయంలో స్పందించాడు. భారత్ వెంట ఆప్ఘనిస్తాన్ మొత్తం ఉందని హామీ ఇచ్చాడు.  ఈ మేరకు రషీద్ ఖాన్ ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేశాడు.

‘‘ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆప్ఘనిస్తాన్ మొత్తం భారత్ కి అండగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే క్షేమంగా ఉండండి. సామాజిక దూరం పాటించడం. అందరూ మాస్క్ లు ధరించండి. #WeAreWithYouIndia’’అంటూ ట్వీట్ చేశాడు.  కాగా.. రషీద్ ఖాన్  ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరపున ఆడుతున్నాడు.

 

ఇదిలా ఉండగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమ్మిన్స్ 50,000 డాలర్లను 'పిఎం కేర్స్ ఫండ్'కు విరాళంగా ఇచ్చారు.

కరోమివైరస్ మహమ్మారి యొక్క రెండవ తరంగానికి వ్యతిరేకంగా భారతదేశం చేసిన పోరాటం కోసం కమ్మిన్స్ తోటి ఆస్ట్రేలియన్ బ్రెట్ లీ ఒక బిట్‌కాయిన్‌ను విరాళంగా ఇచ్చారు.