IPL 2024 Auction: మరికొన్ని గంటల్లో ఐపీఎల్ వేలం.. తప్పుకున్న ఇంగ్లాండ్, బంగ్లా ఆటగాళ్లు..

IPL 2024 Auction: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో   ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 వేలం  మరికొన్ని గంటల్లో దుబాయ్ వేదికగా ప్రారంభం కానున్నది. ఈ వేలం ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఇంగ్లాండ్, బంగ్లాదేశ్‌ క్రికెటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

English Leg Spinner Rehan Ahmed And Bangladesh Taskin Ahmed, Mohammad Shoriful Islam Will Not available for Ipl Auction 2024 KRJ

IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2024 కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా వేలం జరుగుతోంది. 77 స్థానాలకు 333 మంది ఆటగాళ్లు పోటీ పడుతుండటంతో వేలంపై ఉత్కంఠ నెలకొంది, ఏ ఫ్రాంచైజీ ఏ ప్లేయర్లను దక్కించుకుంటుందో? ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్లాడోనని అందరూ ఆత్రుతగా చూస్తున్నారు.

అయితే అంతకు ముందు ముగ్గురు ఆటగాళ్లు వేలం నుండి తమ పేర్లను ఉపసంహరించుకున్నారు. ఒక్కసారిగా ముగ్గురు ఆటగాళ్ల పేర్లను ఉపసంహరించుకోవడం కాస్త షాకింగ్ గానే ఉంది. తమ పేర్లను ఉపసంహరించుకున్న ముగ్గురు ఆటగాళ్లలో ఇంగ్లండ్‌కు చెందిన రెహాన్ అహ్మద్,  బంగ్లాదేశ్‌కు చెందిన తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం ఉన్నారు.

రెహాన్ అహ్మద్

ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్‌తో మార్చి 22 నుంచి 30 వరకు సొంతగడ్డపై టీ20 సిరీస్ ఆడనుంది. దీని తర్వాత కూడా చాలా మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు ఐపీఎల్‌కు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. రెహాన్ తన పేరును ఉపసంహరించుకున్నాడు. జనవరి 2024లో భారత్‌తో జరగనున్న ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెహాన్ అహ్మద్ పాల్గొనున్నారు. 'ESPNcricinfo' ప్రకారం.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 19 ఏళ్ల రెహాన్ ఎక్కువ కాలం ఇంటికి దూరంగా ఉండటం ఇష్టం లేదు. దాని కారణంగా అతను తన పేరును ఉపసంహరించుకున్నాడు.

తస్కిన్ అహ్మద్ , షోరిఫుల్ ఇస్లాం

బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్లు తస్కిన్ అహ్మద్, షరీఫుల్ ఇస్లాం కూడా ఐపీఎల్ వేలం నుంచి తమ పేర్లను ఉపసంహరించుకున్నారు. వాస్తవానికి.. బంగ్లాదేశ్ జట్టు మార్చి - ఏప్రిల్ మధ్య సొంత గడ్డపై శ్రీలంక, జింబాబ్వేతో ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడుతుంది. దీని కారణంగా ఇద్దరు ఆటగాళ్లు IPLలో భాగం కాలేరు.

దేశం వెలుపల తొలిసారిగా వేలం  

IPL 2024 వేలం ద్వారా టోర్నమెంట్‌లోని ఆటగాళ్ల వేలం భారతదేశం వెలుపల నిర్వహించడం ఇదే మొదటిసారి. మునుపెన్నడూ భారత్ వెలుపల వేలం నిర్వహించబడలేదు, అయితే 2024లో జరగనున్న IPL కోసం ఆటగాళ్ల వేలం దుబాయ్ గడ్డపై నిర్వహించబడుతుంది. ఇది కాకుండా.. ఐపిఎల్ వేలంలో తొలిసారిగా మహిళా వేలంపాటను చూడనున్నారు. ఇంతకు ముందు అన్ని ఐపీఎల్ వేలంలో పురుషులే వేలం వేసేవారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios