టీ20 సిరీస్‌లో భారత్ పేలవ ప్రదర్శన కనబరిచింది. బ్యాటింగ్‌లో తడబడింది. 80 పరుగులకే 17వ ఓవర్‌లో ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ ఆరు వికెట్ల నష్టంతో 12వ ఓవర్‌లోనే విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో ఇంగ్లాండ్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. 

India Women vs England Women: రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టుపై భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్ బౌలింగ్ ఎంచుకోగా.. క్రీజులోకి వచ్చిన భారత్ పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమై ఇంగ్లాండ్ ముందు 81 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 11.2 ఓవర్‌లలోనే ఇంగ్లాండ ఈ లక్ష్యాన్ని అలవోకగా సాధించి టీ20 సిరీస్ సొంతం చేసుకుంది.

తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టీమ్ పై భారత టీమ్ 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. వాంఖడే స్టేడియంలో శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లోనూ ఇండియా టీమ్ ఓడిపోయింది. నాలుగు వికెట్లతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది.

భారత్ ఇన్నింగ్:

క్రీజులోకి షెఫాలి వర్మ, స్మృతి మంధాన ఓపెనర్లుగా దిగారు. తొలి ఓవర్‌లోనే షెఫాలి వర్మ ఎల్బీడబ్ల్యూ ఔట్ అయ్యారు. తర్వాత జెమీమా రొడ్రిగ్స్ క్రీజులోకి వచ్చారు. నాలుగో ఓవర్‌లో మంధాన కూడా ఎల్బీడబ్ల్యూ అయ్యారు. నాలుగు ఓవర్‌లలో 19 పరుగులే సాధించిన భారత్ రెండు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత ఐదో ఓవర్‌లో, ఆరో ఓవర్‌లో, ఏడో ఓవర్‌లో ఒక్కో వికెట్ చొప్పున భారత్ కోల్పోయింది. పది ఓవర్‌లకు భారత్ 47 పరుగులకు ఆరు వికెట్లను కోల్పోయింది. 16వ ఓవర్‌లో భఆరత్ 80 పరుగులకు మొత్తంగా కుప్పకూలిపోయింది.

Also Read: WPL 2024 auction: రూ. 40 లక్ష‌ల క‌నీస ధ‌ర‌తో రిజిష్ట‌ర్, కానీ వేలంలో అద‌ర‌గొట్టిన ఆస్ట్రేలియన్ అన్నాబెల్

ఇంగ్లాండ్ బౌలర్ చార్లీ డీన్ మ్యాచ్ ఆరంభంలోనే భారత్ ఆశలకు గండికొట్టారు. తొలి రెండు వికెట్లు సాధించి భారత స్థైర్యాన్ని దెబ్బతీశారు. ఆ తర్వాత నాట్ స్కివర్ బ్రంట్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ఔట్ చేయడంతో భారత అభిమానుల్లో నిరాశ మొదలైంది. రొడ్రిగ్ ఒక వైపు నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా.. మరో వైపు వికెట్లు వరుసగా పడిపోయాయి. చివరికి ఆమె కూడా పెవిలియన్‌కు వెళ్లారు.

ఇంగ్లాండ్ ఇన్నింగ్:

డంక్లీ, వ్యాట్‌లు క్రీజులోకి రాగా.. రేణుకా సింగ్ బౌలింగ్ వేసి తొలి ఓవర్‌లోనే 8 ఎక్స్‌ట్రాలు సమర్పించుకుంది. అయితే, మూడో ఓవర్ వేసిన రేణుకా సింగ్ ఇద్దరు ఓపెనర్లను పెవిలియన్‌కు పంపించింది. ఆ తర్వాత ఏడు ఓవర్‌ల వరకు బ్యాట్స్ విమెన్ క్రీజులో నిలదొక్కుకుని 55 పరుగులు సాధించారు. 11 ఓవర్ కల్లా ఇంగ్లాండ్ టీమ్ 6 వికెట్ల నష్టానికి 76 పరుగులు సాధించింది. 12వ ఓవర్‌లో ఫోర్ కొట్టి ఎక్లస్టోన్ ఇంగ్లాండ్‌కు విజయం కట్టబెట్టింది.