ఇంగ్లాండ్ మహిళా జట్టు స్టార్ స్పిన్నర్ లౌరా మార్ష్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 13 ఏళ్ల తన సుధీర్ఘ కెరీర్‌లో మూడు ఐసీసీ టోర్నీల్లో ఇంగ్లాండ్ విజయం సాధించడం వెనుక కీలకపాత్ర పోషించారు.

2006లో భారత్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన లౌరా మార్ష్ 2019 మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో 16 వికెట్లు తీసి అత్యథిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు. అదే ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లోనూ మంచి గణాంకాలు సాధించారు.

Also Read:కోహ్లీ, రోహిత్ శర్మలను అధిగమించాలనే..: హోప్ ఆశ

2017లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులోనూ భాగమయ్యారు. మొత్తం 103 వన్డేలు, 67 టీ20లు, 9 టెస్టులు ఆడిన మార్ష్ అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 217 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ స్పిన్నర్‌గా తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు.

Also Read:ధోనీ.. ధోనీ.. అంటూ ప్రేక్షకుల హేళన: ప్రతిస్పందించిన రిషబ్ పంత్

ఇంగ్లాండ్ తరపున వన్డే ఫార్మాట్‌లో అత్యథిక వికెట్లు తీసిన మహిళా బౌలర్ల జాబితాలో లౌరా మూడో స్థానంలో నిలిచారు. ఆమె రిటైర్మెంట్ ప్రకటనపై ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ డైరెక్టర్ క్లార్ కానోర్ స్పందించారు. క్రికెట్ చరిత్రలో లౌరా రికార్డులే ఆమె అంకిత భావాన్ని తెలుపుతాయని పేర్కొన్నారు.